Pawan Kalyan : ఆపరేషన్.. ఆపరేషన్ అంటున్నారు.. అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైంది?

పవన్ కి శస్త్ర చికిత్స జరిగిందని అన్నారు. (Pawan Kalyan)

  • Updated on- April 19, 2026 / 02:13 PM IST

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స చేసారని, పది రోజుల పాటు విశ్రాంతి త్రీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు జనసేన పార్టీ శనివారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీంతో రాజకీయాల్లో, సినిమాల్లో చురుగ్గా ఉంటున్న పవన్ ఇలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అని తెలియడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

పవన్ కి శస్త్ర చికిత్స జరిగిందని అన్నారు. పవన్ ఇలా ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని తెలియడంతో, ఆపరేషన్ జరిగిందని తెలియడంతో మోడీ, చంద్రబాబు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అయితే అసలు ఆపరేషన్ అయింది అంటున్నారు కానీ దేని గురించి అయింది అనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

Also Read : Mahavatar Parshuraam : పరుశురాముడు వచ్చేస్తున్నాడు.. మహావతార్ నరసింహ తర్వాత మరో ఉగ్ర రూపం..

పవన్ సన్నిహితుల సమాచారం ప్రకారం.. శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారట. దీంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ లో వైద్యులు పరిశీలించి, MRI స్కాన్ చేసి సైనసైటిస్ అని, దాని తీవ్రత బాగా పెరిగిందని, ముక్కులో దానికి సంబంధించిన సర్జరీ చేయాలని చెప్పారట. శనివారం ఉందయం పవన్ కళ్యాణ్ సైనసైటిస్ ఇబ్బందితో ముక్కుకు సంబంధించిన ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ నిర్వహించారు. శనివారం సాయంత్రం డిశ్చార్జ్ చేయగా ఇంటికి వెళ్లారు పవన్. కనీసం వారం నుంచి పది రోజుల పాటు పవన్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

దీంతో పవన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, కార్యకర్తలు కోరుకుంటున్నారు. సైనసైటిస్ కి ఇప్పుడు సర్జరీ చేసినా తర్వాత జాగ్రత్తగా ఉండాలని లేదా ఏజ్ పెరిగే కొద్దీ దాంతో శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపినట్టు సమాచారం.

Also Read : Nagababu : ఆ గొడవల తర్వాత.. ఏడేళ్లకు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్న నాగబాబు.. వీడియో వైరల్..