Mahavatar Parshuraam : పరుశురాముడు వచ్చేస్తున్నాడు.. మహావతార్ నరసింహ తర్వాత మరో ఉగ్ర రూపం..
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణువు అవతారలపై యానిమేషన్ సినిమాలను చేస్తామని ప్రకటించారు. (Mahavatar Parshuraam)
Mahavatar Parshuraam
Mahavatar Parshuraam : గత సంవత్సరం జులైలో మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా వచ్చి భారీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. భక్త ప్రహ్లాద, హిరణ్య కశ్యపుడు, నరసింహావతారం కథని యానిమేషన్ లో చాలా గొప్పగా, అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరికి కనెక్ట్ అయింది. కేవలం 6 కోట్లతో సినిమా తీస్తే దాదాపు 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ‘మహావతార్ నరసింహ’ రిలీజ్ సమయంలోనే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ విష్ణువు అవతారలపై యానిమేషన్ సినిమాలను చేస్తామని ప్రకటించారు.
Also Read : Nagababu : ఆ గొడవల తర్వాత.. ఏడేళ్లకు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్న నాగబాబు.. వీడియో వైరల్..
మహావతార్: నరసింహ సినిమా 25 జూలై 2025 లో రిలీజ్ అవ్వగా మహావతార్ : పరశురామ్ (2027), మహావతార్ : రఘునందన్ (2029), మహావతార్ : ద్వారకాదీశ్ (2031), మహావతార్ : గోకులానంద్ (2033), మహావతార్ : కల్కి 1 (2035), మహావతార్ : కల్కి 2 (2037) సినిమాలను ప్రకటించారు.
తాజాగా మహావతార్ పరుశురామ్ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసారు. పరుశురాముడు తన ఆయుధం గొడ్డలిని పట్టుకొని బయలుదేరినట్టు ఉంది. అయితే కేవలం కాళ్ళు మాత్రం చూపించారు ఈ పోస్టర్ లో. ఈ పోస్టర్ పై ధర్మం ఓడిపోయినప్పుడు పరుశురాముడు వస్తాడు అని ఉంది. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. పరుశురాముని అవతారం, ఆయన ఉగ్రరూపాన్ని అద్భుతంగా చూపించబోతున్నారని తెలుస్తుంది. మహావతార్ నరసింహని మించి ఈ సినిమా భర్తీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా డిసెంబర్ 2027 లో రిలీజ్ కానుందని ప్రకటించారు.

Also Read : Heroins : మళ్ళీ యాక్షన్ బాట పట్టిన హీరోయిన్స్.. తెరమీద ఉగ్ర రూపమే..
ఈ సినిమా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ మోషన్ గ్లింప్స్, దీనికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
