Nagababu : ఆ గొడవల తర్వాత.. ఏడేళ్లకు మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్న నాగబాబు.. వీడియో వైరల్..
ఒకానొక సమయంలో జబర్దస్త్ నిర్మాణ సంస్థతో విబేధాలు వచ్చాయని, వాటితో పాటు పలు కారణాలతో నాగబాబు జబర్దస్త్ కి దూరమయ్యారు. (Nagababu)
Nagababu
Nagababu : మెగా బ్రదర్ గా, నిర్మాతగా నాగబాబు ఎంత పేరు తెచ్చుకున్నా జబర్దస్త్ జడ్జిగా చాలా పాపులారిటీ తెచ్చుకున్నాడు. నవ్వుల నవాబు నాగబాబు అంటూ జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ పంచులు, తన నవ్వులతో బాగా వైరల్ అయ్యారు. నాగబాబు, రోజా జడ్జీలుగా చాలా ఏళ్ళే జబర్దస్త్ నడిచింది. అయితే ఒకానొక సమయంలో జబర్దస్త్ నిర్మాణ సంస్థతో విబేధాలు వచ్చాయని, వాటితో పాటు పలు కారణాలతో నాగబాబు జబర్దస్త్ కి దూరమయ్యారు. అప్పట్లో ఈ విషయంపై టాలీవుడ్ లో, టీవీ పరిశ్రమలో బాగా చర్చ జరిగింది.
జబర్దస్త్ కి దూరమయ్యాక నాగబాబు వేరే టీవీ షోలలో కనిపించినా ఆ రేంజ్ ఇంపాక్ట్ పడలేదు. ఆ తర్వాత జనసేనలో చురుకుగా మారి రాజకీయాలతో బిజీ అయ్యారు. 2019 లో నాగబాబు జబర్దస్త్ కి దూరమయ్యారు. ఇటీవల ఓ స్పెషల్ జబర్దస్త్ ఎపిసోడ్ లో మాత్రం కనిపించి అలరించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత నాగబాబు మళ్ళీ జబర్దస్త్ జడ్జిగా రాబోతున్నారు.
Also Read : Heroins : మళ్ళీ యాక్షన్ బాట పట్టిన హీరోయిన్స్.. తెరమీద ఉగ్ర రూపమే..
ఈటీవీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. నాగబాబు జడ్జిగా జబర్దస్త్ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరిగింది. ఆ షూటింగ్ కి సంబంధించిన పలు విజువల్స్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నవ్వుల నవాబు నాగబాబు కంబ్యాక్ అంటూ తెలిపింది. దీంతో నాగబాబు జడ్జిగా మళ్ళీ జబర్దస్త్ కి తిరిగి రానున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆ ఎపిసోడ్ కూడా రానుంది.
అయితే కేవలం కొన్ని ఎపిసోడ్స్ కేనా? లేక గతంలో లాగా ఫుల్ టైం జడ్జిగా నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కి కంబ్యాక్ ఇచ్చారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. జబర్దస్త్ కమెడియన్స్ కి నాగబాబు ఎంతో సపోర్ట్ చేసారు. వాళ్లంతా ఆయనకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాగబాబు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో కమెడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు రీ ఎంట్రీ ఇటీవల పడిపోయిన జబర్దస్త్ రేటింగ్ పెరగడానికి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.
Also Read : Pradeep Ranganathan : పాపం.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోని ముంచేసిన నయనతార భర్త..
