Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై క్లారిటీ.. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ కీలక ప్రకటన!
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొత్త సినిమాలపై కీలక ప్రకటన చేసిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’.
- V Santhosh Kumar
- Published On : March 24, 2026 / 03:48 PM IST
Pawan Kalyan Team Provides Clarity on His New Movie
- కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్
- నెట్టింట వైరల్ అవుతున్న రూమర్స్
- అధికారిక ప్రకటన చేసిన పవన్ టీం
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటంతో, ఆయన సినిమా కెరీర్ గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమానే కాకుండా పవన్ మరో సినిమాను కూడా ఓకే చేశారు అంటూ చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Akshay Kumar: ‘ధురంధర్’ ఒక అడల్ట్ మూవీ.. అది వారికోసమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్
అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఎటువంటి కొత్త సినిమా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తన పూర్తి సమయాన్ని కేవలం ప్రజా సేవకే కేటాయిస్తున్నారు. ఇప్పుడప్పుడే కొత్త చిత్రాలను ప్రారంభించే ఆలోచనలో లేరని, ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్ట్ ఖరారైతే స్వయంగా అధికారికంగా ప్రకటిస్తామని సంస్థ పేర్కొంది. OG2కి సంబంధించి ఏవైనా వివరాలు ఉంటే, అవి కూడా సరైన సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పంచుకుంటారని స్పష్టం చేశారు.
దీంతో, ఈ ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, ఫ్యాన్స్ లో కొత్త కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత పవన్ సురేందర్ రెడ్డి, సుజీత్ సినిమాలు చేయాల్సి ఉంది. అయితే, తాజా ప్రకటనతో అసలు ఆ ప్రాజెక్టులు ఉంటాయా లేదా అనే అనుమానం మొదలవుతోంది. ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ టీం విడుదల చేసిన ప్రకటనలో చాలా కంఫ్యూజన్స్ మొదలయ్యాయి. మరి వీటిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.
