Akshay Kumar: ‘ధురంధర్’ ఒక అడల్ట్ మూవీ.. అది వారికోసమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన అక్షయ్ కుమార్
ధురంధర్ 2 సినిమాపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) షాకింగ్ కామెంట్స్ చేశారు.
Akshay Kumar shocking comments on Dhurandhar 2
Akshay Kumar: బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు, స్టార్ హీరోలు ధురంధర్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన ధురంధర్ సినిమా గురించి అక్షయ్(Akshay Kumar) మాట్లాడుతూ, ‘ధురంధర్’ సాధిస్తున్న విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని పెంచింది. ‘ధురంధర్’ అనేది రియల్ ఇన్సిడెంట్ తో కూడిన యాక్షన్ డ్రామా. ఇది ప్రధానంగా ‘అడల్ట్’ ప్రేక్షకులను ఉద్దేశించి తీసిన సినిమా అని చెప్పుకొచ్చాడు.
Divi Vadthya: క్రేజీ లుక్ లో దివి అందాలు.. బైక్ తో బ్యాక్ లుక్ కెవ్వు కేక.. ఫొటోలు
ఇక, తన రాబోయే చిత్రం ‘భూత్ బంగ్లా’తో ‘ధురంధర్’కు ఉన్న పోలికలపై స్పందిస్తూ.. ఈ రెండు పూర్తిగా భిన్నమైన జానర్లు అని స్పష్టం చేశారు. ‘భూత్ బంగ్లా’ అనేది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఈ హారర్ కామెడీ సినిమాను రూపొందించాము అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, ధురంధర్ పై అక్షయ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక, ‘భూల్ భులయ్యా’ వంటి క్లాసిక్ హిట్‌ను అందించిన అక్షయ్ కుమార్ – ప్రియదర్శన్ కాంబినేషన్, సుమారు 17 ఏళ్ల తర్వాత ‘భూత్ బంగ్లా’ సినిమా రావడంతో అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి. ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, తబు, మిథిలా పాల్కర్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది చూడాలి.
