Pawan Kalyan : OG నుంచి కలర్ ఫుల్ పోస్టర్.. సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.(Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి రెండో సాంగ్ మెలోడీ సువ్వి సువ్వి.. అనే పాటను వినాయకచవితి పండగ ఆగస్టు 27 న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఒక స్పెషల్ కలర్ ఫుల్ ఫోటో కూడా రిలీజ్ చేసారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కల్సి నీటిలో దీపం వదులుతున్నట్టు ఉంది.

Also Read : Balakrishna : ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలయ్య పేరు.. ఎందుకో తెలుసా?

దీంతో ఈ సినిమాల్లో గ్యాంగ్ స్టర్ డ్రామాతో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.