×
Ad

OG Glimpse : అదిరిపోయిన OG గ్లింప్స్.. పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే..

తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు.

  • Published On : September 2, 2023 / 10:36 AM IST

OG Glimpse

OG Glimpse Teaser : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే OG సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు. పవన్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో DVV దానయ్య నిర్మాణంలో They Call him OG సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా, తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఫోటోలు లీక్ అవ్వడంతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముందు నుంచి గ్లింప్స్ (OG Glimpse) పై హంగ్రీ చీతా అంటూ హైప్ ఇస్తూ వచ్చారు చిత్రయూనిట్. హైప్ కి తగ్గట్టే గ్లింప్స్ అదిరిపోయింది.

ఈ గ్లింప్స్ 99 సెకండ్స్ ఉంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అంటూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ మొదలైంది. అప్పుడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటిదాకా ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే.. అన్ని పవన్ కళ్యాణ్ కి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పవన్ ఇందులో కత్తి పట్టుకొని ఫైట్ చేయడం, గన్ పట్టుకొని కాల్చడం చూపించారు. ఈ గ్లింప్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక దీనికి థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ గ్లింప్స్ చూస్తుంటే భాషా సినిమా రేంజ్ లో ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ కథలా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.