Pawan Kalyan: టైటిల్‌తో పాటు పవన్ కటౌట్ కూడా మారుస్తానంటోన్న హరీష్ శంకర్..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కాకముందే, ఆయన తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. దర్శకుడు హరీష్ శంకర్‌తో గతంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేయగా, దాన్ని కాదని ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అంటూ మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను హరీష్ తనదైన మార్క్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కాకముందే, ఆయన తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. దర్శకుడు హరీష్ శంకర్‌తో గతంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేయగా, దాన్ని కాదని ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అంటూ మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను హరీష్ తనదైన మార్క్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ ట్యాగ్‌పై జరుగుతున్న రచ్చ..

అయితే ఈ సినిమాకు టైటిల్‌ను మార్చిన హరీష్, ఈ సినిమా కోసం పవన్ లుక్‌ను కూడా పూర్తిగా మార్చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘హరిహర వీరమల్లు’లో కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్న పవన్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో పవన్‌ను సరికొత్తగా చూపిస్తే, ఈ సినిమాకు అభిమానులు ఫిదా కావడం ఖాయమని ఆయన భావిస్తున్నాడట. అందుకే పవన్‌ను ఈమేరకు కొత్తగా మేకోవర్ చేయాలని హరీష్ రిక్వెస్ట్ చేశాడట.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముహూర్తం ఈవెంట్ గ్యాలరీ..

దీనికి పవన్ కూడా ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే, పవన్‌ను సరొకత్త అవతారంలో మనం త్వరలోనే చూడబోతున్నామని అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా అప్డేట్స్ కోసం చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు