Pawan Kalyan To Join Ustaad Bhagat Singh Sets From This Date
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుండి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాను పీరియాడిక్ ఫిక్షన్ కథగా చిత్ర యూనిట్ తీసుకొస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Pawan Kalyan: ఉగాది గిఫ్ట్‌ను రెడీ చేస్తోన్న పవన్.. వీరమల్లు కాదండోయ్!
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ ప్రాజెక్టులను ఓకే చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ఓకే చేసిన పవన్, యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఇక గతంలో హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ ‘గబ్బర్‌సింగ్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కావడంతో, ఈసారి ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ రాబోతుందా అని సినీ వర్గాలు సైతం ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఎప్పుడు జాయిన్ కాబోతున్నాడనే విషయంపై తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది.
ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఏప్రిల్ 5 నుండి జాయిన్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే లేదా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో కలిసి చేస్తున్న సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ముగించుకుని ఉస్తాద్ భగత్ సింగ్‌లో జాయిన్ కావాలని పవన్ ప్రయత్నిస్తున్నాడట. ఈ వార్తలో అభిమానులు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి మరిన్ని అప్డేట్స్ రావాలని కోరుతున్నారు.