×
Ad

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా అప్డేట్ ఇస్తామంటున్న నిర్మాతలు.. సినిమా ఇంకా ఉందా అంటున్న ఫ్యాన్స్..

తాజాగా చిత్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ అభిమానులని ఆశ్చర్యపరుస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చింది.

  • Published On : March 16, 2024 / 11:33 AM IST

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Update by Mythri Movie Makers

Ustaad Bhagat Singh : హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ హిట్ కొట్టి పవన్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. ఈ కాంబోలో రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయి ఈ సినిమా కోసం ఎదురుచూసారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై హైప్ ఇచ్చారు.

కానీ పవన్ కళ్యాణ్ తన రాజకీయ షెడ్యూల్స్ వల్ల సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా అటకెక్కింది. రెండేళ్లు ఎదురుచూసి హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పక్కనపెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టాడు. ఇక పవన్ అభిమానులు అయితే ఈ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. ఒకవేళ ఈ సినిమా ఉన్నా ఎన్నికలు అయ్యాకే ఉండొచ్చు. కానీ తాజాగా చిత్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ అభిమానులని ఆశ్చర్యపరుస్తూ ఓ అప్డేట్ ఇచ్చింది.

Also Read : Kartik Aaryan : వామ్మో ఏకంగా ఆరు కోట్లు పెట్టి కార్ కొన్న స్టార్ హీరో.. దీంతో నాలుగు ఖరీదైన కార్లు..

మైత్రి మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియాలో మీరు ఊహించని అప్డేట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి త్వరలో ఇవ్వబోతున్నాము అని పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు అసలు సినిమా గురించి కూడా మాట్లాడని చిత్రయూనిట్ ఇప్పుడు అప్డేట్ ఇస్తాము అనడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూనే ఈ సినిమా ఇంకా ఉందా? సినిమా వర్క్ జరుగుతుందా? ఏంటి ఆ అప్డేట్ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఆ అప్డేట్ ఏంటి? ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పకపోవడం గమనార్హం.