Anna Lezhneva : పీఎం మోదీకి ప్రామిస్ చేశా.. పవన్ కళ్యాణ్ భార్య స్పెషల్ పోస్ట్..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పవన్ భార్య అన్నా లెజినోవా ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. (Anna Lezhneva)
- Saketh U
- Updated on- May 11, 2026 / 07:10 AM IST
Anna Lezhneva
Anna Lezhneva : పీఎం మోదీ ఆదివారం నాడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు. సైనస్ కి సంబంధించిన శస్త్ర చికిత్స తీసుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని పరామర్శించడానికి పీఎం మోదీ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లారు.
పవన్ ఇంట్లో తన నలుగురు పిల్లలు, భార్య అన్నా లెజినోవాని కూడా మోదీ పలకరించి వారితో మాట్లాడారు. పవన్ ఫ్యామిలీతో మోదీ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పవన్ భార్య అన్నా లెజినోవా ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
Also Read : Pawan Kalyan : మొదటిసారి తన నలుగురు పిల్లలతో పవన్ కళ్యాణ్.. పీఎం మోదీతో స్పెషల్ గ్రూప్ ఫోటో వైరల్..
పీఎం మోదీతో దిగిన ఫోటోలను షేర్ చేసి.. ఆయన నా భర్తతో ముందు హెల్త్ మీద ఫోకస్ చేయమని, ఆరోగ్యం కుదుటపడ్డాకే వర్క్ కి తిరిగి రమ్మని చెప్పారు. అలాగే నాకు నా భర్తని జాగ్రత్తగా చేసుకొమ్మని చెప్పారు. నేను అది సంతోషంగా చేస్తున్నాను. నేను పీఎం మోదీకి ప్రామిస్ చేశాను. నా భర్తని జాగ్రత్తగా చూసుకుంటాను అని పోస్ట్ చేసింది.
