Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ కోసం చిరంజీవి.. ‘మంగళవారం’ ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్..

ఇటీవల మగళవారం సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రిలీజ్ చేశారు.

Payal Rajput Ajay Bhupathi Mangalavaaram Movie Trailer Released by Megastar Chiranjeevi

Mangalavaaram Trailer : ఆర్ఎక్స్ 100’(RX 100) సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi). ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్ద్ లతో చేసిన మల్టీస్టారర్ మహాసముద్రం నిరాశ మిగల్చగా ఇప్పుడు ‘మంగళవారం’ అనే మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్త నిర్మాణంలో అజయ్ భూపతి దర్శకత్వంలో RX 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతుంది మంగళవారం. ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే మంగళవారం మూవీ షూట్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇటీవల మగళవారం సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మంగళవారం సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒక ఊర్లో ప్రతి మంగళవారం హత్యలు జరుగుతుంటాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు కనిపెట్టడమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.

చిరంజీవి ట్రైలర్ షేర్ చేస్తూ.. ‘మంగళవారం’ సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజకి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లోకి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా వుంటుంది. వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీ తో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరు. స్వాతిరెడ్డి లాంటి యంగ్‌స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Also Read : నాని 31 అఫీషియల్ అనౌన్స్.. ఆ దర్శకుడితో మళ్ళీ.. పండక్కి ముహూర్తం..

ఇక ఈ మంగళవారం సినిమా నవంబర్ 17న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాతో మరోసారి పాయల్, అజయ్ భూపతి హిట్ కొడతారేమో చూడాలి.