కరోనా టెస్ట్.. పాయల్ చిన్నపిల్లలా ఏడ్చేసింది..

  • Publish Date - September 27, 2020 / 02:03 PM IST

Payal Rajput corona test: కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. గత ఆరు నెలలుగా ఇళ్లకే పరిమితమైన స్టార్స్ బ్యాక్ టు వర్క్ అంటూ ఒక్కొకరుగా షూటింగులో జాయిన్ అవుతున్నారు. షూటింగ్ స్పాట్‌లో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.


తాజాగా ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కూడా షూటింగులో జాయిన్ అయినట్లుంది.  తాజాగా ఈ బ్యూటీ కరోనా టెస్ట్ చేయించుకుంది. కరోనా పరీక్ష కోసం పాయల్ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకున్నారు వైద్య సిబ్బంది. ఆ సమయంలో చిన్న పిల్లలా ఏడ్చేసింది పాయల్. చిన్నపిల్లలా గోలగోల చేసింది.


దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై పాయల్ స్పందిస్తూ .. ‘అలా శాంపిల్స్ తీసుకోవడంతో చాలా భయమేసింది. 5 సెకన్ల పాటు నోస్‌లో తిప్పుతూ శాంపిల్స్ తీసుకోవడం భయంగా, ఇబ్బందిగా అనిపించింది. ఏదేమైనా టెస్ట్‌లో నెగిటివ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది పాయల్.