వీడియో చిక్కులు : నటి పాయల్ రోహత్గి అరెస్టు

  • Publish Date - December 15, 2019 / 12:09 PM IST

బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెహ్రూ ఫ్యామిలీపై అభ్యంతరకరంగా వీడియో పోస్టు చేసిందనే ఆరోపణలపై అరెస్టు చేశారు. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం రాజస్థాన్‌కు చెందిన దర్యాప్తు బృందం సభ్యులు ముంబై వెళ్లారు. నేరుగా పాయల్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

అహ్మదాబాద్‌లో అదుపులోకి తీసుకోవడం జరిగిందని బుంది పోలీసు సూపరింటెండెంట్ మమత గుప్తా వెల్లడించారు. బుందికి సోమవారం తీసుకరావడం జరుగుతుందని, నెహ్రూపై అభ్యంతకర వ్యాఖ్యలకు సంబంధించిందన్నారు. వాక్ స్వాతంత్ర్రాన్ని హరించి వేశారని, స్వేచ్చగా మాట్లాడే హక్కు ఓ జోక్ గా మారిందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కానీ తాను గూగుల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే తాను పోస్టు చేయడం జరిగిందని వివరించారు.

అదుపులోకి తీసుకోవడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. స్వేచ్చగా మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాయల్ జీ అరెస్టు పౌర హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

Read More : – ఇదేనా మీరిచ్చే గౌరవం : గొల్లపూడి అంత్యక్రియలకు మా అసోసియేషన్ దూరం
అసలేం ఏం జరిగింది : – 
నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై సెప్టెంబర్ 01వ తేదీన ఫేస్ బుక్‌లో అభ్యంతకర వీడియోను రోహత్గి పోస్టు చేశారని బుంది పీఎస్‌లో రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అక్టోబర్‌లో కంప్లయింట్ చేశారు. ఇన్ఫరేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రోహత్గిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాయల్ పలు హిందీ టీవీ, రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేగాకుండా కొన్ని బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది.