బోరబండలో భూకంపం.. ‘కార్తీకదీపం’ సీరియల్ మిస్ అయ్యానంటూ మహిళ ఆవేదన!..

  • Publish Date - October 3, 2020 / 12:16 PM IST

Karthika Deepam Serial: హైదరాబాద్, బోరబండ సైట్‌ 3 లోని వీకర్స్‌ కాలనీలో శుక్రవారం రాత్రి భూమి నుంచి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.. శబ్ధాలకు భయపడి.. రాత్రి రోడ్డు మీదే నిద్రించారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని కొంతమంది రాత్రంతా మేలుకునే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ శబ్ధాలు రావడంతో రాత్రి కార్తీక దీపం సీరియల్ కూడా చూడలేకపోయానని బస్తీ మహిళ ఒకరు చెప్పడం విశేషం. కాగా శనివారం ఉదయం ఐదు గంటలకు మరో సారి శబ్ధాలు వచ్చాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించ లేదు. భూమిలో నీరు పారుతుంటే కూడా ఇలాంటి శబ్ధాలు వస్తాయంటున్నారు నిపుణులు.