Phone Hacking : సినీ పరిశ్రమలో ఫోన్స్ హ్యాకింగ్ కలకలం.. జాగ్రత్త.. అలాంటి ఫైల్ డౌన్లోడ్ చేస్తే డేంజర్..
ఇటీవల సినీ పరిశ్రమలో పలువురి ఫోన్స్ హ్యాకింగ్ కి గురయ్యాయి అని సమాచారం.(Phone Hacking)
- Saketh U
- Published on- August 20, 2026 / 03:13 PM IST
Phone Hacking
Phone Hacking : సైబర్ మోసాలు, ఫోన్ హ్యాకింగ్స్ ఇటీవల పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్ని వదలట్లేదు హ్యాకర్లు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో పలువురి ఫోన్స్ హ్యాకింగ్ కి గురయ్యాయి అని సమాచారం.
ఒకప్పటి స్టార్ నిర్మాత ఫోన్ ఇటీవల హ్యాక్ అయి అతని ఫేస్ బుక్ నుంచి చాలా మందికి మెసేజ్ లు వెళ్లాయట. ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉన్న APK ఫైల్ ని అందరికి పంపారట. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అవతలి వాళ్ళ ఫోన్ కూడా హ్యాక్ అయిపోయినట్టే. అలా ఆ సీనియర్ నిర్మాత నుంచి మెసేజ్ లు వెళ్లడంతో సినీ పరిశ్రమలోని పలువురు వ్యక్తులు ఆయనకు, ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్లకు ఫోన్స్ చేస్తే ఆయన ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం బయటపడింది. అంతే కాకుండా ఆయన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ కి భారతదేశం నంబర్ కాకుండా వేరే నంబర్స్ తో మెసేజ్ లు కూడా వెళ్లాయట.
Also Read : Jagamae Sangeetham : మరో కొత్త సిరీస్ నిర్మించిన చిరంజీవి కూతురు.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు?
తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫోన్ కూడా హ్యాక్ అయింది. ఆయన ఫోన్ కూడా ఇదే పద్దతిలో హ్యాక్ అయి అతని ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికి వాట్సాప్ ద్వారా ఒక డౌన్లోడ్ ఆప్షన్ ఉన్న APK ఫైల్ ని పంపారట. ఆ ఫైల్ డౌన్లోడ్ చేస్తే అవతలి వ్యక్తి ఫోన్ కూడా హ్యాక్ అయినట్టే. ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ హ్యాక్ చేసి అతని అకౌంట్ నుంచి డబ్బులు కూడా దోచేసారు హ్యాకర్స్. దీంతో సినీ పరిశ్రమలో ఈ ఫోన్స్ హ్యాకింగ్ కలకలం సృష్టిస్తుంది.
దీంతో జాగ్రత్త అంటూ, ఎలాంటి తెలియని మెసేజ్ లు, తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వొద్దని, ఎలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని సినీ ప్రముఖులు కోరుతున్నారు. మీరు కూడా తెలియని నంబర్స్ నుంచి కాల్స్, మెసేజ్ లు వచ్చినా, తెలిసిన వాళ్ళ దగ్గర్నుంచి ఫైల్ డౌన్లోడ్ చేయమని వచ్చినా స్పందించకుండా జాగ్రత్త వహించండి. మీ ఫోన్ హ్యాక్ అయితే వెంటనే సైబర్ క్రైమ్ ని సంప్రదించండి.
Also See : Nivetha Thomas : నివేదా థామస్ లేటెస్ట్ ఫోటోలు చూశారా..? అమ్మ చీరలో..
