Pithapuramlo… Ala Modalaindi : ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ రిలీజ్ డేట్ అనౌన్స్..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. (Pithapuramlo… Ala Modalaindi)

  • Published on- September 8, 2026 / 04:07 PM IST

Pithapuramlo… Ala Modalaindi

Pithapuramlo… Ala Modalaindi : ప్రేయసి రావే ఫేమ్ దర్శకుడు మహేష్ చంద్ర చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అనే సినిమాతో రాబోతున్నాడు. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాణంలో మహేష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ అవ్వనుంది.

Also Read : Bigg Boss Love Track : బిగ్ బాస్‌లో మొదలైన లవ్ ట్రాక్.. ఆ కంటెస్టెంట్ తో ఫ్లర్టింగ్ చేస్తున్న సుధీర్ రెడ్డి..

ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం.. లాంటి అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ఈ సినిమాని తెరకెక్కించాం. సహజమైన పాత్రలు, సంఘటనలతో సినిమా సహజంగా ఉంటుంది. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఇందులో కీలక పాత్రలో నటించారు. ఇరుముడి, విశ్వనాథం అండ్ సన్స్, మా ఇంటి బంగారం తరహా లోనే మా సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అని తెలిపారు.