Mangli: సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగులపై కేసు నమోదు.. చంపేస్తామని బెదిరించారంటూ..

తాజాగా ప్రముఖ గాయని మంగ్లీపై, దర్శకుడు వేణు ఉడుగులపై పోలీసు కేసు నమోదైంది. (Mangli)

  • Published On : April 11, 2026 / 10:12 AM IST

Singer Mangli and Director Venu Udugula Case

Mangli : తాజాగా ప్రముఖ గాయని మంగ్లీపై, దర్శకుడు వేణు ఉడుగులపై పోలీసు కేసు నమోదైంది. మంగ్లీ, మరో ముగ్గురి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2), 352 కింద వీరిపై కేసు నమోదు చేసారు.

Also Read : సూపర్ హిట్ యూత్ ఫుల్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎక్కడ?

కేసు వివరాల్లోకి వెళ్తే..

మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల, మరికొంత మంది కలిసి సుమారు 100 మంది దగ్గర వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి భారీగా డబ్బు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎంతకాలం అయినా కూడా లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. దీంతో బాధితుల తరపున ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు.

బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో న్యాయవాది మంగ్లీ, ఆమె బృందంని నిలదీయగా ఇతన్ని బెదిరించారు. దాంతో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారని, తనను రోడ్డు ప్రమాదం చేయించి చంపేస్తామని వారు హెచ్చరించారని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ బెదిరింపుల వ్యవహారంలో దర్శకుడు వేణు ఉడుగుల పాత్ర కూడా ఉందని న్యాయవాది పోలీసులకు తెలిపారు. దీంతో పెట్టుబడుల పేరుతో సామాన్యులను మోసం చేయడమే కాక బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగుల ఇంకా స్పందించలేదు.

Also Read : ఇంగ్లీష్ లో పచ్చి బూతులు తిట్టాడు. రోడ్ మీద కొట్టా అతన్ని.. అడివి శేష్ కామెంట్స్ వైరల్..