Youth OTT : సూపర్ హిట్ యూత్ ఫుల్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎక్కడ?
ఈ సినిమాలో లవ్ స్టోరీ, కామెడీకి ఇప్పటి జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యారు. (Youth)
Youth OTT April 16 on netflix
Youth OTT : తమిళ సీనియర్ నటుడు కరుణాస్ తనయుడు కెన్ బాల నటుడిగా, నటుడిగా పలు సినిమాలతో మెప్పించి ఇటీవలే హీరోగా మారి యూత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైగా ఈ సినిమాని అతనే డైరెక్ట్ చేయడం గమనార్హం.
కెన్ కరుణాస్, అనీషా అనిల్ కుమార్, మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్ ముఖ్య పాత్రల్లో కెన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యూత్’ సినిమా తమిళ్, తెలుగులో ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. తమిళ్, తెలుగులో కలిపి ఈ సినిమా దాదాపు 20 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులోనే 6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది యూత్ సినిమా. ఈ సినిమాలో లవ్ స్టోరీ, కామెడీకి ఇప్పటి జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యారు.
Also Read : ఇంగ్లీష్ లో పచ్చి బూతులు తిట్టాడు. రోడ్ మీద కొట్టా అతన్ని.. అడివి శేష్ కామెంట్స్ వైరల్..
థియేటర్స్ లో హిట్ కొట్టిన యూత్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. యూత్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తమిళ్, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఈ సినిమా ఏప్రిల్ 16 నుంచి చూసేయండి..
View this post on Instagram
Also Read : బాలిలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రాజాసాబ్ భామ.. ఫొటోలు..
