Ponniyin Selvan I : “త్రిష-ఐశ్వర్య”లు మాట్లాడుకోకుండా మణిరత్నం అగ్రిమెంట్.. విషయం ఏమంటారు?

తమిళ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న బారి బడ్జెట్ చిత్రం "పొన్నియన్ సెల్వన్". ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న విడుదల కానుండడంతో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు 'మణిరత్నం'ని.. "త్రిష-ఐశ్వర్య లతో ఏదో అగ్రిమెంట్ చేయించుకున్నారంటా" అదేంటని ప్రశ్నించగా, అయన బదులిస్తూ..

  • Published on- September 25, 2022 / 12:14 PM IST

Mani Ratnam Warns Aishwarya Rai and Trisha

Ponniyin Selvan I : తమిళ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న బారి బడ్జెట్ చిత్రం “పొన్నియన్ సెల్వన్”. తమిళనాడు చారిత్రక కథలు ఆధారంగా రాబోతున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి భారీ తారాగణంతో.. ఎంతో ప్రతిష్ఠాతంకంగా తెరకెక్కింది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Suhasini Maniratnam: నార్త్ VS సౌత్.. హిందీ మంచి లాంగ్వేజ్: సీనియర్ నటి సుహాసిని

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30న విడుదల కానుండడంతో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు ‘మణిరత్నం’ని.. “త్రిష-ఐశ్వర్య లతో ఏదో అగ్రిమెంట్ చేయించుకున్నారంటా” అదేంటని ప్రశ్నించగా, అయన బదులిస్తూ.. “సినిమా కంప్లీట్ అయ్యేవరకు మాట్లాడుకోవద్దని చెప్పాను” అని అన్నాడు.

“సినిమాలో వీరిద్దరి పాత్రలు చాలా సీరియస్ గా ఉంటాయి, అలాగే వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగిది. కానీ త్రిష-ఐశ్వర్య ల మధ్య ఉన్న స్నేహంతో.. సీన్స్ లో ఒకరిపై ఒకరు కఠినత్వం చూపలేకపోతున్నారు. ఆ సమయంలో సీన్స్ కి చాలా కష్టపడాల్సి వస్తుంది, అందుకనే కనీసం సెట్స్ లో అయిన వారిద్దరి మధ్య స్నేహం లేకుండా చేస్తే.. సీన్స్ లో ఆ సీరియస్ నెస్ కనిపిస్తుందేమోని ఆలా చేశానంటూ”.. చెప్పుకొచ్చాడు.