Suhasini Maniratnam: నార్త్ VS సౌత్.. హిందీ మంచి లాంగ్వేజ్: సీనియర్ నటి సుహాసిని

సౌత్ స్టార్స్.. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ అంశంపై ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తుండగా.. అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్‌ల మధ్య ట్విట్టర్ వార్ దీనిని మరింత పెంచేసింది.

Suhasini Maniratnam: నార్త్ VS సౌత్.. హిందీ మంచి లాంగ్వేజ్: సీనియర్ నటి సుహాసిని

Suhasini Maniratnam

Suhasini Maniratnam: సౌత్ స్టార్స్.. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ అంశంపై ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్స్ చేస్తుండగా.. అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్‌ల మధ్య ట్విట్టర్ వార్ దీనిని మరింత పెంచేసింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో కిచ్చా సుదీప్ ‘హిందీ జాతీయ భాష కాదని మాట్లాడితే.. అజయ్ దేవగన్.. ‘హిందీ జాతీయ భాష కానప్పుడు… మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేశారు.

Suhasini : చిరంజీవి, సుహాసిని స్పెషల్ వాట్సాప్ గ్రూప్.. అందులో ఎవరెవరు ఉంటారో తెలుసా??

అది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి అటు నార్త్ నుండి ఇటు సౌత్ నుండి సెలబ్రిటీలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సౌత్ నుండి ఎందరో సుదీప్ కి మద్దతు ఇవ్వగా.. నార్త్ నుండి పెద్దగా స్పందన కరువైంది. కాగా.. ఇదే అంశంపై సీనియర్ నటి సుహాసిని మణిరత్నం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతున్నాయి. నటులు అన్ని భాషలు నేర్చుకోవాలని అభిప్రాయపడిన నటి సుహాసిని ‘హిందీ మంచి లాంగ్వేజ్. హిందీ మాట్లాడే వారు మంచి వాళ్లు. కచ్చితంగా ఆ భాష నేర్చుకోవాలని చెప్పుకొచ్చారు.

Mani Ratnam’s PS1: డ్రీమ్ ప్రాజెక్ట్ పీఎస్-1 రిలీజ్ డేట్ ప్రకటించిన మణిరత్నం

‘తమిళం వాళ్లు కూడా మంచి వారేనని.. హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషం’ అని పేర్కొంది. అయితే ఆమె వ్యాఖ్యలపై తమిళ మీడియా, యువత ట్రోల్స్ చేస్తున్నారు. సహజంగానే సౌత్ రాష్ట్రాలని హిందీ తీవ్రంగా వ్యతిరేకించే రాష్ట్రాలలో తమిళనాడు ముందుంటుంది. ఆంధ్రా, తెలంగాణలో పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా తమిళనాట మాత్రం ఈ బాషా వాదంపై ఉద్యమాలే నడిచిన చరిత్ర ఉంది. అందుకే.. హిందీ మంచి లాంగ్వేజ్ అంటూ సుహాసిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ తీవ్ర దుమారం రేపుతున్నాయి.