Pooja Hegde: పూజా హెగ్డే ప్రేమాయణం.. బాలీవుడ్ నటుడితో బుట్టబొమ్మ డేటింగ్?
పూజా హెగ్డే(Pooja Hegde) బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో డేటింగ్ లో ఉంది అంటూ న్యూస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- April 30, 2026 / 09:39 AM IST
Pooja Hegde is dating Bollywood actor Rohan Mehra.
- రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమాయణం
- నెట్టింట వైరల్ అవుతున్న రిలేషన్ వార్తలు
- త్వరలో క్లారిటీ రానున్న డేటింగ్ రూమర్స్
Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ఆమె ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి బయట కనిపించడం, ఒకరి పుట్టినరోజున మరొకరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటి అంశాలు ఈ రూమర్లకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Sravanthi Chokkarapu: వన్నె తగ్గని అందం, వయ్యారాల విందు.. చీరలో స్రవంతి చొక్కారపు కిల్లింగ్ పోజులు
రోహన్ మెహ్రా నేపథ్యం పరిశీలిస్తే, ఆయన దివంగత బాలీవుడ్ లెజెండరీ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. తండ్రి మరణానంతరం కెన్యాలో పెరిగిన రోహన్, యూకేలో చదువు ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చారు. సంజయ్ లీల భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, 2018లో ‘బజార్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఆయన, ఆ తర్వాత ‘420 IPC’, ‘కాలా’ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
వృత్తిపరంగా పూజా హెగ్డే(Pooja Hegde) ప్రస్తుతం తమిళంలో ‘జన నాయకన్’, హిందీలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. గతంలో రోహన్ మెహ్రా నటి తారా సుతారియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రాగా, ప్రస్తుతం పూజతో ఆయన రిలేషన్ గురించి సాగుతున్న చర్చలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమాల ఫలితాల కంటే కూడా ఈ జంట మధ్య నడుస్తున్న కెమిస్ట్రీనే ఇప్పుడు నెటిజన్ల ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
