Pooja Hegde : బుట్టబొమ్మ.. ఈసారైనా హిట్ కొడుతుందా..?

పూజా హెగ్డే సరైన సక్సెస్‌ అందుకుని దగ్గర దగ్గరగా ఆరేళ్లేకి పైగా అవుతోంది. (Pooja Hegde)

  • Published on- October 13, 2026 / 08:33 PM IST

Pooja Hegde

Pooja Hegde : ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా.. బ్యాడ్‌లక్‌ అలా వెంటాడుతూనే ఉంటుంది. ప్రజెంట్‌ పూజా హెగ్డే పరిస్థితి దాదాపుగా ఇలానే ఉంది. ఎంతో కాలంగా ఒక హిట్టు కూడా లేని ఈ బుట్టబొమ్మ లిస్ట్‌లో ఈ ఇయర్‌ రెండు భారీ డిజాస్టర్స్‌ చేరిపోయాయి. బాలీవుడ్‌లో వరుణ్‌ ధావణ్‌ హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ మరో హీరోయిన్‌గా తెరకెక్కిన హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాతో ప్లాప్‌ అందుకున్న పూజా.. కోలీవుడ్‌లో దళపతి విజయ్‌ చివరి సినిమా జన నాయగన్‌తోనూ ఫ్లాప్‌ ఫేస్‌ చేసింది. దీంతో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న తెలుగు సినిమా శ్రీ శ్రీ మీదే ఆశలు పెట్టుకుంది పూజా హెగ్డే.

పూజా హెగ్డే సరైన సక్సెస్‌ అందుకుని దగ్గర దగ్గరగా ఆరేళ్లేకి పైగా అవుతోంది. 2020లో వచ్చిన అల వైకుంఠపురములో తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డాయి. టాలీవుడ్‌లో బ్యాడ్‌టైమ్ నడుస్తుందని బాలీవుడ్‌కి వెళ్తే.. అక్కడా సేమ్‌ సీన్‌ రిపీట్‌. బీటౌన్‌ వదిలి కోలీవుడ్‌లో సినిమాలు చేసినా రిజల్ట్‌లో మాత్రం మార్పు రాలేదు. తెలుగులో చివరిగా ఆచార్య సినిమాలో కనిపించి దూరమైన ఈ బుట్టబొమ్మ టాలీవుడ్‌ ఆడియెన్స్‌ మీదే భారం వేస్తుంది. రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న శ్రీ శ్రీ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

Also Read : Jailer 2 : జైలర్‌ 2 తెలుగు ప్రమోషన్స్ లేనట్టేనా.. నిరాశలో టాలీవుడ్ ప్రేక్షకులు..

నార్త్‌ టు సౌత్‌ ఎన్ని ఫెయిల్యూర్స్‌ వచ్చినా సరే.. ఆఫర్స్‌ పరంగా పూజా హెగ్డే ట్రెండ్‌ అవుతూనే ఉంది. దుల్కర్ సల్మాన్‌ శ్రీ శ్రీ సినిమాతో పాటు రాఘవ లారెన్స్‌ హారర్‌ కామెడీ సీక్వెల్‌ కాంచన 4లోనూ పూజా హెగ్డే మెయిన్ లీడ్‌గా చేస్తోంది. అలాగే AA23 ప్రాజెక్ట్‌ ఆగిపోయిందంటూ వైరలవుతోన్న రూమర్స్‌కి స్పెషల్ ఫొటోతో ఎండ్‌కార్డ్‌ వేసిన అల్లు అర్జున్‌-లోకేశ్ కనగరాజ్‌ ప్రస్టేజియస్‌ సినిమాలోనూ పూజా హెగ్డే నటించే చాన్స్‌ ఉందని టాక్‌ వినిపిస్తోంది. మొత్తంగా శ్రీ శ్రీ సినిమాతో హిట్టు అందుకుని ఐకాన్‌స్టార్‌ సినిమాలో చాన్స్‌ పట్టేస్తే మాత్రం బుట్టబొమ్మకి కాలం కలిసొచ్చినట్లే.