O Na Siddayya Song Promo: ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట ప్రోమో ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా ఆస్కార్ విజేత చంద్రబోస్.. త్వరలోనే పూర్తి పాట!
భార్యాభర్తల ప్రేమానురాగాల నేపథ్యంతో తెరకెక్కిన 'ఓ నా సిద్ధయ్య(O Na Siddayya Song Promo)' పాట ప్రోమో హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది.
O na siddayya song promo launch siddu reddy kandakatla chandrabose
O Na Siddayya Song Promo: భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాలు, బంధాలు, భావోద్వేగాల నేపథ్యంతో తెరకెక్కిన ‘ఓ నా సిద్ధయ్య(O Na Siddayya Song Promo)’ మ్యూజిక్ వీడియో పాట ప్రోమో హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక వేత్త సిద్దు రెడ్డి కందకట్ల, కాత్యాయనీ జగన జంటగా నటించిన ఈ పాట ప్రోమో ఆవిష్కరణ కార్యక్రమానికి 2,000 మందికి పైగా విద్యార్థులు, అభిమానులు, అతిథులు హాజరై సందడి చేశారు. రామ్ అద్నాన్ దర్శకత్వంతో పాటు సాహిత్యం అందించగా, కళ్యాణ్ కీస్ సంగీతం సమకూర్చారు. ఈ వేడుకలో పాట టైటిల్, పోస్టర్‌తో పాటు ప్రోమోను ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, శ్యామ్ కాసర్ల, నల్గొండ గద్దర్ నర్సన్న, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వంటి ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.
సేవా నిరతి చాటుకున్న వేడుక.. 300 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు బీమా:
పాట ప్రోమో ఆవిష్కరణతో పాటు నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమం ఈ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిద్దు రెడ్డి కందకట్ల ఆధ్వర్యంలో 300 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల ఉచిత బీమా కవరేజీని అందించారు. అర్హత కలిగిన ప్రత్యేక సందర్భాల్లో ఈ బీమా ద్వారా బాధితులకు రూ. 10.5 లక్షల వరకు సహాయం అందేలా డిజైన్ చేశారు. గతంలో లండన్, మలేషియా లలో పలు అంతర్జాతీయ గ్లోబల్ ఫిలాంత్రోపీ అవార్డులు అందుకున్న సిద్దు రెడ్డి, సినిమా వేదికగానూ తన సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల పలువురు ప్రముఖులు కొనియాడారు.
అకట్టుకుంటున్న విజువల్స్.. త్వరలోనే పూర్తి పాట విడుదల:0
కుటుంబ విలువలు, దంపతుల సంతోషాలు, కష్టసుఖాల కలబోతగా రూపొందిన ఈ పాటలో నటీనటుల అభినయం ఆకట్టుకుంటోంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు అరుణ్ కొలుగూరి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు వహించగా, రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో విశేష స్పందన పొందుతున్న ఈ ప్రోమో ఆధారంగా, పూర్తి స్థాయి పాటను అతిత్వరలోనే అధికారికంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
