Pooja Mishra : నా కెరీర్ ఆ హీరో వల్లే నాశనమైంది.. నాకు చేతబడి చేసి వాళ్ళ అమ్మాయిని స్టార్‌ని చేశారు..
పూజా మిశ్ర మాట్లాడుతూ.. ''17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తుంది. మా నాన్న అతనికి కోట్ల రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే అతను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. ఓసారి నేను....................
- Saketh U
- Updated on- May 6, 2022 / 06:46 AM IST
Poojaa Mishra
Pooja Mishra : మోడల్, బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ ఫేమ్ పూజా మిశ్ర తాజాగా ఒకప్పటి స్టార్ హీరో, ఎంపీ శత్రుఘ్న సిన్హపై తీవ్ర విమర్శలు చేసింది. అతనితో పాటు, అతడి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా మిశ్ర నా కెరీర్ శత్రుఘ్న సిన్హ వల్లే నాశనమైందని, నా మీద చేతబడి చేశారని, తమ కూతురిని స్టార్ హీరోయిన్ చేయడానికి నన్ను బలి చేశారని పేర్కొంది. పూజా మిశ్ర చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
ఈ ఇంటర్వ్యూలో పూజా మిశ్ర మాట్లాడుతూ.. ”17 ఏళ్లుగా శత్రుఘ్న సిన్హ, అతడి కుటుంబం నన్ను వేధిస్తుంది. మా నాన్న అతనికి కోట్ల రూపాయలు ఇచ్చి సహాయం చేస్తే అతను మాత్రం నా కెరీర్‌ను నాశనం చేశాడు. ఓసారి నేను శత్రుఘ్న సిన్హాకు బర్త్‌డే విషెస్ చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్తే అతడి భార్య పూనమ్ నాకు చేతబడి చేసిన పదార్థాన్ని తినిపించి నా శరీరం నా కంట్రోల్లో లేని సమయంలో సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేశారు. నాకు భయపడి నన్ను నాశనం చేసి తన కూతురు సోనాక్షి సిన్హను స్టార్‌ను చేశాడు. నాకు డ్రగ్స్ అలవాటు చేసి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. అతని వల్లే నేనింకా పెళ్లి చేసుకోలేదు, నా కెరీర్ అతనివల్లే నాశనమైంది” అంటూ శత్రుఘ్న సిన్హాపై తీవ్రవిమర్శలు చేసింది.
Shivani Rajasekhar : మిస్ తమిళనాడుగా రాజశేఖర్ కూతురు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
అయితే ఈ ఆరోపణలపై శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అతను తన ట్విట్టర్లో.. ”ఆమెకు వృత్తిపరంగా సహాయం కావాలనుకుంటా, అందుకే ఇలా నా కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంది. కెరీర్ బాగోక ఆమె మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతోంది. ఇలాంటి చెత్త కథనాలపై స్పందించి నేను సమయం వృథా చేసుకోను. కానీ నిజాలు తెలియకుండా మా కుటుంబ గౌరవానికి భంగం కలిగించే లాంటి కథనాలు రాసేవాళ్ల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను” అని సీరియస్ గానే పోస్ట్ చేశాడు.
