Poonam Pandey – Bold – హాట్ మోడల్ గా పేరొందిన పూనమ్ పాండే పెళ్లి చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకుంది. సెప్టెంబర్ 01న కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిందని వెల్లడిస్తూ..దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఈ భామ.
దీంతో ఆమె వివాహం జరిగిపోయిందని బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాహానికి సంబంధించిన విషయాలు వెల్లడించింది. నీతో ఏడు జన్మలు కలిసి నడవాలని అనుకుంటున్నట్లు క్యాప్షన్ జత చేసింది.
https://10tv.in/rare-singing-dog-thought-to-be-extinct-in-wild-for-50-years-still-thrives/
రహస్యంగా ఏమీ చేసుకోలేదని కరోనా నేపథ్యంలో ప్రైవేటుగా జరిపించాల్సి వచ్చిందన్నారు. ఇద్దరి మనస్సులు ఒకటే విధంగా ఉంటాయని, తనకంటే తెలివైనవాడని వెల్లడించింది. వైరస్ కారణంగా హనీమూన్ ట్రిప్ నిలిచిపోయింది. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత..తాను, సామ్, లాస్ ఏంజెల్స్ వెళుతామని తెలిపారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రెండు సంవత్సరాలుగా సామ్ తో డేటింగ్ చేస్తోంది.
పూనమ్,
సామ్ 2020, జులై 27వ తేదీన లాక్ డౌన్ సమయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి డ్రైవ్ చేశారని సామ్, పూనమ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారని మేలో వార్తలు వచ్చాయి. దీనిని ఆమె ఖండించారు.
మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన పూనమ్…వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందారు. 2013లో నాషాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2015లో తెలుగులో వచ్చిన Malini & Co చిత్రంలో ఓ నామమాత్రపు పాత్ర పోషించారామె. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా…తన మొబైల్ అప్లికేషన్ ది పూనమ్ పాండే యాప్ తో బిజీగా ఉన్నారు. ఫొటోలు, వీడియోలను అందులో పోస్టు చేస్తుంటారు.