Pop Singer Madonna : ఐసీయూలో అమెరికన్ పాప్ సింగర్.. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఇంటెన్సివ్ కేర్‌లో!
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా తన కూతురితో సహా హాస్పిటల్ లో అనారోగ్యంతో అడ్మిట్ అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఇంటెన్సివ్ కేర్‌లో..
- gum 95921
- Published On : June 29, 2023 / 02:53 PM IST
Pop Singer Madonna Hospitalised with her daughter in new york
Pop Singer Madonna : ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ మడోన్నా అనారోగ్యానికి గురైనట్లు ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరిస్తూ ఎంతోమంది అభిమానాలను సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాదితో ఆమె సంగీత కెరీర్ స్టార్ట్ చేసి 40 పూర్తి చేసుకోవడంతో.. ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఒక ప్రకటన చేశారు. ‘సెలబ్రేషన్’ పేరిట వరల్డ్ వైడ్ గా ఒక మ్యూజికల్ పర్యటనను ప్రకటించారు. జూలై 15న వాంకోవర్‌లో ఈ పర్యటనను ప్రారంభించి.. డిసెంబర్ 1న ఆమ్‌స్టర్‌డామ్ లో ఈ పర్యటనను ముగించనున్నట్లు గతంలోనే ప్రకటించారు.
Kamal Haasan : డైరెక్టర్ శంకర్‌కి ఖరీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. సినిమా రిలీజ్ అవ్వకుండానే..
అయితే ఇంతలోనే ఆమె అనారోగ్యానికి గురవ్వడం అందర్నీ బాధిస్తుంది. గత కొద్దిరోజులుగా పలు మ్యూజిక్ ఈవెంట్స్ లో పాల్గొంటూ వస్తున్న మడోన్నా అస్వస్థతకు గురయ్యారు. మడోన్నాతో పాటు ఆమె కుమార్తె కూడా అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో వారిద్దర్నీ న్యూయార్క్ లోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించేందుకు ICUలో అడ్మిట్ చేశారు. మడోన్నా బ్యాక్టీరియా వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురి కావడం వల్ల ఇంటెన్సివ్ కేర్ విభాగంలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
The Academy : RRR టీంకు మరో అరుదైన గౌరవం.. అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో ఏకంగా RRR నుంచి 6గురు..
ప్రస్తుతం మడోన్నా ఆరోగ్యం కోలుకుంటుందని, ఆమె అయితే ఇంకా డాక్టర్స్ సంరక్షణలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చారు మేనేజర్. ఇక మడోన్నా అనారోగ్యానికి గురవ్వడంతో ఆమె ముందుగా సైన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటికి బ్రేక్ పడినట్లు అయ్యింది. మడోన్నా అనారోగ్యం నుంచి కోలుకోగానే మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని రీ షెడ్యూల్ చేస్తామంటూ మేనేజర్ పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.
