Posani Krishna Murali : 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ దర్శకుడిగా మారిన పోసాని.. ఆపరేషన్ అరుణారెడ్డి అంటూ..
మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పోసాని కృష్ణ మురళి దర్శకుడిగా మారి హీరోగా నటిస్తూ, నిర్మాతగా కూడా మారి 'ఆపరేషన్ అరుణారెడ్డి' అనే సినిమాని తెరకెక్కించారు. (Posani Krishna Murali)
- Saketh U
- Published on- July 15, 2026 / 03:27 PM IST
Posani Krishna Murali
Posani Krishna Murali : ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి గతంలో దర్శకుడిగా పలు సినిమాలు చేసి విజయం సాధించారు. నటుడిగా కూడా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ఇప్పుడు అడపాదడపా చేస్తున్నారు. చివరగా పోసాని 2011 లో దర్శకుడిగా దుశ్శాసన అనే సినిమాతో వచ్చారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పోసాని కృష్ణ మురళి దర్శకుడిగా మారి హీరోగా నటిస్తూ, నిర్మాతగా కూడా మారి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమాకు పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసానినే నిర్వహించడం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జులై 17న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
Also Read : Pawan Kalyan : డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం.. చేతికట్టుతోనే ఇంటికి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ భార్య..
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ మహదేవ్ ఏలేందర్ మాట్లాడుతూ.. స్క్రిప్ట్ లో డైలాగ్స్ తో పాటు లిరిక్స్ కూడా రాసుకున్నారంటే పోసాని ఎంత పక్కాగా ఈ స్క్రిప్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇది పోసాని గారికి 2.0 గా మారుతుంది అన్నారు. హీరోయిన్ హిందోళ చక్రవర్తి మాట్లాడుతూ.. ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, మన సొసైటీని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి నాకు మంచి మిత్రులు. మా కాంబినేషన్ లో ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేస్తామని అన్నారు. నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత త్వరగా షూటింగ్ చేసుకుని రిలీజ్ కు వస్తోందంటే కారణం నా మిత్రుడు శ్రీనివాస్. నేను రైటర్ గా వంద సినిమాలు చేశాను. నటుడిగా వందలాది సినిమాల్లో నటించాను. దర్శక నిర్మాతగా కూడా సినిమాలు తీసాను. కానీ నేను చేసిన అన్ని సినిమాల్లో ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చాను. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఏం జరుగుతుందో ఊహించలేరు. ఈ సినిమాలో ఒక్క బూతు గానీ, ఒక్క అసభ్యమైన సన్నివేశం గానీ ఉండదు అని అన్నారు.
