పవన్ ప్రశంసించాడు – నితిన్ పొంగిపోయాడు!

నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం విజయవంతమైన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు..

  • Publish Date - February 24, 2020 / 01:58 PM IST

నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రం విజయవంతమైన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు..

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీష్మ’. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ అండ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

నితిన్ పెర్ఫార్మెన్స్, వెంకీ టేకింగ్‌కి మంచి అప్లాజ్ వస్తోంది. సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు ‘భీష్మ’ టీమ్‌ని అభినందిస్తున్నారు. తాజాగా నితిన్ పిచ్చి పిచ్చిగా అభిమానించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీష్మ’ చిత్ర బృందాన్ని అభినందించారు. నితిన్, వెంకీ కుడుముల, నిర్మాత నాగవంశీలకు పవన్ శుభాకాంక్షలు తెలియచేశారు.

Read More>>రూ. కోటి కావాలట: టబూ పాత్రలో ఎవరు?

పవన్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్ షూటింగ్ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతుంది. సెట్‌లో ‘భీష్మ’ టీమ్ పవర్ స్టార్‌ను కలిశారు. సినిమా టాక్, వసూళ్లు తదితర వివరాలు తెలుసుకున్న పవన్.. నితిన్, నాగవంశీ, వెంకీలను అభినందించారు. ‘భీష్మ’ టీమ్‌ని పవన్ అభినందిచడం వెలకట్టలేని సందర్భం’ అని నితిన్ పోస్ట్ చేయగా ‘పవన్ ప్రశంసించడం మా టీమ్ అందరికీ లైఫ్ టైమ్ మూమెంట్’ అని దర్శకుడు వెంకీ ట్వీట్ చేశారు.