OG Song
OG Song : పవర్ స్టార్ పవన్ క్లయం OG సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. పవన్ ఎక్కడ కనపడినా OG OG అని అరుస్తున్నారు ఫ్యాన్స్. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ సినిమా నుంచి ఫైర్ స్టార్మ్ అనే సాంగ్ రిలీజ్ చేయగా అది బాగా వైరల్ అయింది.
OG సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ లిరిక్స్ లో అదిరిపోయే మ్యూజిక్ తో అందర్నీ మెప్పించింది. ఈ పాటలో పవన్ విజువల్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సాంగ్ తో OG పై మరిన్ని అంచానాలు నెలకొన్నాయి. OG సినిమాలో జపనీస్ బ్యాక్ డ్రాప్ ఉందని ఆల్రెడీ సుజిత్ చెప్పాడు. అందుకే ఈ పాటలో కూడా జపనీస్ భాష వాడారు.
Also Read : Tamil Directors : తమిళ్ స్టార్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?
అయితే పాటలో కొన్ని లిరిక్స్ కూడా జపనీస్ లో వేశారు. ఈ క్రమంలో సాంగ్ మొదట్లో వేసిన ఓ జపనీస్ పదం బాగా వైరల్ అవుతుంది. సాంగ్ లో パワースター ఈ పదం ఇప్పుడు అందర్నీ మెప్పిస్తుంది. ఇంతకీ దీని మీనింగ్ ఏంటంటే పవర్ స్టార్ అని అర్ధం. పవర్ స్టార్ కి జపనీస్ భాషలో అలా రాస్తారు. సాంగ్ లో పవర్ స్టార్ అని ఇంగ్లీష్ లో ఇచ్చే బదులు ఇలా జపనీస్ భాషలో పెట్టడంతో మరింత హైప్ నెలకొంది. సుజీత్ క్రియేటివిటీకి తెగ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. ఇంకేముంది ఫ్యాన్స్ ఇప్పటికే ఈ జపనీస్ పదాన్ని సోషల్ మీడియాలో, బయట వైరల్ చేసి ప్రింట్ చేసేస్తున్నారు.
Also Read : Satya Dev : కింగ్డమ్ షూటింగ్ లో ప్రమాదం నుంచి బయటపడ్డాము.. విజయ్ కి సినిమా అయ్యాక అలా మెసేజ్ చేస్తే..