Satya Dev : కింగ్డమ్ షూటింగ్ లో ప్రమాదం నుంచి బయటపడ్డాము.. విజయ్ కి సినిమా అయ్యాక అలా మెసేజ్ చేస్తే..

సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Satya Dev : కింగ్డమ్ షూటింగ్ లో ప్రమాదం నుంచి బయటపడ్డాము.. విజయ్ కి సినిమా అయ్యాక అలా మెసేజ్ చేస్తే..

satya dev kingdom

Updated On : August 3, 2025 / 3:25 PM IST

Satya Dev : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటీవల జులై 31న థియేటర్స్ లో రిలీజయి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే 67 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో సత్యదేవ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నేడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ఛాలెంజింగ్ సీన్స్ గురించి సత్యదేవ్ మాట్లాడుతూ.. ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలి. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే నా యాక్షన్ సీన్స్ కి అంత మంచి స్పందన వస్తోంది. గౌతమ్ నా పాత్రను రాసిన తీరే అద్భుతంగా ఉంది. ఓ వైపు తమ్ముడు, మరోవైపు దివి ప్రజలు, ఇంకో వైపు ఒక నిజం తెలుసు కానీ ఎవరికీ చెప్పలేడు. ఇలా ఆ పాత్ర చుట్టూ ఎంతో ఎమోషన్ ఉంది. సినిమాలో ఫిజికల్ గా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ మాత్రం ప్రీ క్లయిమాక్స్ యాక్షన్ ఎపిసోడ్. ఆ యాక్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సీన్స్ లో బాగా అలిసిపోయాను. ఆ షూట్ అయ్యాక రెండు రోజుల వరకు లెగలేదు.

ఈ సినిమాలో బోట్ సీక్వెన్స్ హైలెట్. ఆ సీక్వెన్స్ కోసం కూడా చాలా కష్టపడ్డాము. నాకు బోట్ డ్రైవ్ చేయడం రాదు. కానీ నన్ను నమ్మి విజయ్ బోట్ లో కూర్చున్నాడు. ఆ నీటి ప్రవాహానికి తగ్గట్టుగా దానిని నడపాలి. అదేమో కుడి వైపుకి తిప్పితే ఎడమ వైపుకి వెళ్తుంది, ఎడమ వైపుకి తిప్పితే కుడి వైపుకి వెళ్తుంది. మొదట చాలా భయం వేసింది. ఆ బోట్ ఛేజింగ్ సీక్వెన్స్ సమయంలో కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడ్డాము. ఓసారి చెట్ల కొమ్మల్లోకి వెళ్ళిపోయాము, మరోసారి చెట్టు మీద పడబోయింది. మహేష్, కసిరెడ్డి నీళ్ళల్లో పడిపోయారు. చాలా భయపడుతూ ఆ సీన్స్ చేసాము. దాదాపు నాలుగు రోజులు షూట్ చేసాము అది అని తెలిపారు.

Also Read : Allu Aravind : పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. సనాతన ధర్మంపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కింగ్డమ్ లో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్, తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా ఈ సినిమాకి వచ్చినన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడూ రాలేదు. సినీ పరిశ్రమలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాకు కాల్స్ చేసి అభినందించారు. గౌతమ్ నాకు కింగ్‌డమ్ కథ చెప్పగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుండా వెంటనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను. బ్లఫ్ మాస్టర్ సినిమాకి నాకు పేరొచ్చింది కానీ, అది జనాల్లోకి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. కానీ ఈ సినిమా భారీతనం, విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి అంశాలు తోడై తక్కువ సమయంలోనే ఎక్కువమందికి చేరువైంది. శివ పాత్ర కోసం మొదట గౌతమ్ నా పేరే రాసుకున్నారట. కానీ ఏవో కారణాల వల్ల మధ్యలో వేరే నటులతో కూడా చేద్దామనుకున్నారు. సరిగ్గా షూటింగ్ కి వెళ్ళడానికి వారం రోజుల ముందు గౌతమ్ నన్ను కలిసి ఈ కథ చెప్పారు. అప్పుడు గౌతమ్ శివ పాత్ర కోసం నేను మొదట ఎవరి పేరు రాసుకున్నానో.. వాళ్ళతోనే చేస్తుండటం సంతోషంగా ఉంది అన్నాడు.

satya dev kingdom

విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. విజయ్ తో నాకు అంతకముందు పరిచయం లేదు. కలిసిన తర్వాత విజయ్ చాలా మంచి వ్యక్తి అని తెలిసింది. తక్కువ సమయంలోనే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. విజయ్ ని నేను నిజంగానే ఒక బ్రదర్ లా ఫీల్ అయ్యాను. సినిమా అయ్యాక అతనికి నిన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయ్యాను అని చెప్తే అతను కూడా నాకు అలాగే అనిపించింది అని చెప్పాడు.

నిర్మాత నాగవంశీ గురించి మాట్లాడుతూ.. నాగవంశీ గారు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక కథను నమ్మి సినిమా చేద్దాం అనుకున్నారంటే ఎక్కడా వెనకడుగు వేయరు, ఏ విషయంలోనూ రాజీపడరు. అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంత పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది అని అన్నారు.

Also Read : Kingdom Collections : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..?

తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. అరేబియన్ కడలి అనే సిరీస్ చేశాను. అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘ఆరంభం’ ఫేమ్ అజయ్‌ నాగ్‌ తోనూ ఓ చిత్రం చేస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి అని తెలిపాడు.