Kingdom Collections : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..?
తాజాగా మూవీ యూనిట్ కింగ్డమ్ 3 రోజుల కలెక్షన్స్ ని ప్రకటించారు.

Kingdom Collections
Kingdom Collections : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ఇటీవల జులై 31న థియేటర్స్ లో రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కింగ్డమ్ సినిమా 39 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజులకు 53 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
తాజాగా మూవీ యూనిట్ కింగ్డమ్ 3 రోజుల కలెక్షన్స్ ని ప్రకటించారు. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.
Also Read : Madhan Bob : తమిళ్ స్టార్ కమెడియన్ కన్నుమూత.. తెలుగులో పవన్ కళ్యాణ్ ఒక్క సినిమానే చేసిన నటుడు..
ఇక ఈ సినిమాకు 53 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అంటే ఆల్మోస్ట్ 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. నేడు ఆదివారం, వచ్చే వారం ఏ సినిమాలు లేకపోవడంతో కింగ్డమ్ కి కలిసి వచ్చి ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయిపోతుందని తెలుస్తుంది.