Allu Aravind : పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. సనాతన ధర్మంపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Allu Aravind : పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. సనాతన ధర్మంపై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Allu Aravind

Updated On : August 3, 2025 / 2:07 PM IST

Allu Aravind : ఇటీవల యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ రిలీజయి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం 6 కోట్లు పెట్టి తీస్తే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమాని అల్లు అరవింద్ రిలీజ్ చేసారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

మహావతార్ నరసింహ సినిమా మన చరిత్ర, ధర్మం గురించి సంబంధించిన సినిమా, గొప్పగా చిత్రీకరించడంతో ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Kingdom Collections : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..?

అల్లు అరవింద్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. నాకు తెలిసిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ కి తెలిసినంతగా సనాతన ధర్మం గురించి ఎవరికీ తెలియదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ చూసి, దీని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

అలాగే మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం వస్తే.. ఆయన సనాతన ధర్మం నమ్మి నడిచే మనిషి కాబట్టి ఒక పాత్రలో ఆయనను తీసుకురాగలిగితే, అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సనాతన ధర్మం సంబంధించిన సినిమా తీస్తాను అని అన్నారు. మరి పవన్ కళ్యాణ్ మహావతార్ నరసింహ సినిమా చూసి స్పందిస్తారా చూడాలి.

Also Read : Madhan Bob : తమిళ్ స్టార్ కమెడియన్ కన్నుమూత.. తెలుగులో పవన్ కళ్యాణ్ ఒక్క సినిమానే చేసిన నటుడు..