Tamil Directors : తమిళ్ స్టార్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారో తెలుసా?
ఈ ఫోటోని దర్శకుడు గౌతమ్ మీనన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Tamil Directors
Tamil Directors : ఇటీవల సీనియర్ నటీనటులు, దర్శకులు రీ యూనియన్స్ చేసుకుంటున్నారు. అందరూ కలిసి ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం 90స్ తమిళ్, తెలుగు నటీనటులు, కొంతమంది దర్శకులు రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు.
తాజాగా పలువురు సీనియర్ తమిళ్ దర్శకులు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఇందులో 90లలో, 2000 దశాబ్దంలో వరుస సినిమాలు తీసి హిట్స్ కొట్టిన దర్శకులు ఉన్నారు. వీరంతా ఇప్పటికి సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నారు. ఈ బ్యాచ్ లో ఇప్పటి డైరెక్టర్ నెల్సన్ కూడా చేరాడు. కొంతమంది తమిళ దర్శకులు ఇటీవల ఇలా అందరూ కలిసి ఓ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఫోటోని దర్శకుడు గౌతమ్ మీనన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Also Read : Satya Dev : కింగ్డమ్ షూటింగ్ లో ప్రమాదం నుంచి బయటపడ్డాము.. విజయ్ కి సినిమా అయ్యాక అలా మెసేజ్ చేస్తే..
గౌతమ్ మీనన్ షేర్ చేసిన దర్శకుల ఫొటోలో.. గౌతమ్ మీనన్, నెల్సన్ దిలీప్ కుమార్, శంకర్, మణిరత్నం, మిస్కిన్, లింగుస్వామి, మురుగదాస్, కేఎస్ రవికుమార్.. ఉన్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ లవర్స్ కూడా ఇలా దర్శకులంతా ఒకే ఫ్రేమ్ లో కనపడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.