Boyapati-Pawan: బోయపాటితో పవర్ స్టార్.. ఇది సెట్టయ్యే కాంబినేషనేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకపక్క సినిమాలు.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ గతంలో ఎన్నడూ లేనంతగా
- Naresh Mannam
- Published On : January 12, 2022 / 11:12 AM IST
Boyapati Pawan
Boyapati-Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకపక్క సినిమాలు.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ గతంలో ఎన్నడూ లేనంతగా పాన్ ఇండియా సినిమాలపై కూడా ఫోకస్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ షూటింగ్ లో ఉన్న పవన్.. అది పూర్తి కాగానే హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొననున్నాడు.
Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?
కాగా.. పవన్ కళ్యాణ్ గురించి ఓ క్రేజీ గాసిప్ ఒకటి వినిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను. తాజాగా బాలయ్య అఖండ సినిమాతో ఇండస్ట్రీ హిట్ సెట్ చేసిన బోయపాటి ఆ తర్వాత అల్లు అర్జున్ తో మరోసారి జతకట్టనున్నాడు. కాగా.. బోయపాటి-పవన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ టాక్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే.. ఈ కాంబినేషన్ పట్టాలెక్కడం కష్టమే అనిపిస్తుంది.
Siddharth : సిద్ధార్థ్‌ను చూసి మిగతా సెలబ్రిటీలు ఏం నేర్చుకోవాలి..?
ప్రస్తుతం పవన్ చేతిలో రెండు సినిమాలున్నాయి. బోయపాటి కూడా ఓ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాలు పూర్తయ్యేందుకు ఓ ఏడాదికి పైగా సమయం తీసుకోనుండగా మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది. దీంతో పవన్ మళ్ళీ రాజకీయాలతో బిజీ కానున్న నేపథ్యంలో బోయపాటితో సినిమా ఉంటుందా అన్నది అనుమానమే. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందా.. లేక ప్రచారంగానే మిగిలిపోతుందో చూడాలి.
