ఈ ప్రేమకథకు 18 ఏళ్ళు

2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఖుషి, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

  • Publish Date - April 27, 2019 / 02:33 PM IST

2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఖుషి, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక జంటగా, శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై, స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం నిర్మించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ.. ఖుషి. 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఖుషి, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 18 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమా ద్వారా ఎస్.జె.సూర్య దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. యూత్‌ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాక, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది ఖుషి. పవన్ కళ్యాణ్‌కి హీరోగా 7వ సినిమా ఇది.

పవన్ వన్ మ్యాన్ షోగా ఖుషి మరో లెవల్‌కి తీసుకెళ్ళింది. అతని ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్, మణిశర్మ మ్యూజికల్ మ్యాజిక్, పి.సి.శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యాయి. భూమిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. విడుదలైన అన్ని సెంటర్స్‌లోనూ అత్యధిక రోజులు ఆడింది ఖుషి. శివాజీ, అలీ, సుధాకర్, విజయ్ కుమార్ తదితరులు నటించగా, దర్శకుడు ఎస్.జె.సూర్య గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ముంతాజ్ ఐటమ్ సాంగ్‌తో అలరించింది.

ఖుషిలో అన్నిపాటలూ చాలా బాగుంటాయి. ‘ఏ మేరా జహా’, ‘అమ్మాయే సన్నగా’, ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’, ‘ప్రేమంటే సులువు కాదురా’, ‘చెలియ చెలియా’, ‘గజ్జె గల్లుమన్నాదిరో’ వంటి సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నిలిచిపోతుంది ఖుషి..

వాచ్, ‘అమ్మాయే సన్నగా’ సాంగ్..