Adipurush : ఇండియా వైడ్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా.. శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్‌తోనే..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కంటే ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్‌తోనే..

Prabhas Adipurush theatrical satellite ott rights sold for huge price

Prabhas Adipurush : ప్రభాస్ నటించిన ఆదిపురుష్ రేపు (జూన్ 16) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయణ కథ కావడంతో మూవీ పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణసంస్థలు టి సిరీస్, రెట్రోఫైల్స్ కలిసి 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి. తెలుగులో ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కినందుకున్న సంగతి తెలిసిందే.

Adipurush : ఇండియా వైడ్ 4000 పైగా స్క్రీన్స్‌లో ఆదిపురుష్.. మొదటిరోజే 100 కోట్ల కలెక్షన్స్..!

ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని సుమారు 150 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక నార్త్ మరియు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో మొత్తం థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. మొత్తం మీద థియేట్రికల్ రైట్స్ ద్వారా 270 కోట్ల వరకు మూవీ టీంకి వచ్చేశాయి. ఇక శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్‌ ద్వారా దాదాపు 210 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టోటల్ గా చూసుకుంటే 480 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Allu Arjun : అల్లు అర్జున్ AAA థియేటర్ ఓపెన్.. మొదటి సినిమాగా ఆదిపురుష్.. టికెట్ బుకింగ్స్ ఓపెన్..

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవాలి. కాగా ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది. మొదటిరోజే ఈ చిత్రం 75 నుంచి 100 కోట్ల వరకు ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది అంటున్నారు బాలీవుడ్ సినీ విశ్లేషకులు.