×
Ad

Eeswar : ప్రభాస్ ఫస్ట్ సినిమాకు 23 ఏళ్ళు.. ‘ఈశ్వర్’ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ ఎంతో తెలుసా? హిట్టా? ఫ్లాపా?

ప్రభాస్ ఈశ్వర్ సినిమా 2002 నవంబర్ 11న రిలీజయింది. ఈ సినిమా రిలీజయి 23 ఏళ్ళు అయింది. (Eeswar)

Eeswar

Eeswar : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. చేతిలో అరడజను సినిమాలు పెట్టుకొని వరుసగా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా ఎప్పటికి స్పెషల్. ప్రభాస్ ఫస్ట్ సినిమా ఓ సింపుల్ లవ్ స్టోరీతో కామెడీ ఎమోషనల్ గా తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ ఊర మాస్ హీరోగా నటించాడు.(Eeswar)

ప్రభాస్ ఈశ్వర్ సినిమా 2002 నవంబర్ 11న రిలీజయింది. ఈ సినిమా రిలీజయి 23 ఏళ్ళు అయింది. దీంతో ఈ సినిమాకు చెందిన విషయాలు వైరల్ గా మారాయి.

Also Read : Dharmendra : బాలీవుడ్ స్టార్ హీరో.. నిన్న మరణించాడన్నారు.. ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్..

సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న ప్రభాస్ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ కాగా అశోక్ కుమార్ విలన్. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడం గమనార్హం.

ఈ సినిమాకు కేవలం కోటి రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ మహేష్ బాబుతో చేసిన టక్కరి దొంగ సినిమా డిజాస్టర్ కావడంతో తక్కువ బడ్జెట్ లో కొత్త హీరోతో సినిమా తీయాలనుకున్నాడు. అలా ప్రభాస్ ని తీసుకొని ఈశ్వర్ సినిమాని కేవలం కోటి రూపాయలతో తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా జస్ట్ హిట్ గా నిలిచింది.

Also See : Kajal Aggarwal : ఆస్ట్రేలియాలో కాజల్ అగర్వాల్ వెకేషన్.. భర్తతో కలిసి ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..

ఈశ్వర్ సినిమా దాదాపు 3.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ అంతా సేఫ్ అయ్యారు. ఎక్కువ లాభాలు రాకపోయినా ఎవరికీ నష్టం లేదు. పైగా ఈశ్వర్ సినిమాని సోమవారం రిలీజ్ చేసారు. సాధారణంగా సినిమాలను గురువారం, శుక్రవారం రిలీజ్ చేస్తారు. కానీ ఈశ్వర్ సినిమా చిత్రంగా సోమవారం రిలీజ్ చేసారు. దీంతో కలెక్షన్స్ కోసం వీకెండ్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.

ఇక ఈ సినిమా స్ట్రైట్ గా గుంటూరులోని ఒక్క థియేటర్లో 100 రోజులు ఆడింది, షిఫ్టులతో మూడు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 22 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అలా ప్రభాస్ ఫస్ట్ సినిమా ఈశ్వర్ జస్ట్ హిట్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ప్రభాస్ వేల కోట్ల కలెక్షన్స్, వందల కోట్ల బడ్జెట్ సినిమాలతో స్టార్ డమ్ చూస్తున్నాడు.