Sapthagiri Trolls: సప్తగిరి షాకింగ్ కామెంట్స్.. ‘ది రాజసాబ్’ చిన్న సినిమానా.. మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన కమెడియన్ సప్తగిరి(Sapthagiri).
- V Santhosh Kumar
- Updated on- May 11, 2026 / 02:58 PM IST
Prabhas fans trolling actor Saptagiri about recent commentsPrabhas fans trolling actor Saptagiri about recent comments
- సప్తగిరి వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
- రాజా సాబ్ చిన్న సినిమానా సప్తగిరి
- రెండు వేల కోట్ల స్పీచ్ మర్చిపోయావా
Sapthagiri: గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లాస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ భారీ హైపుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కానీ, ప్రభాస్ మేనరిజమ్స్, ఆయన వెటకారం మాత్రం ఫ్యాన్స్ కు బాగానే నచ్చాయి. అయితే ఈ సినిమా ఫలితం కంటే, ఇందులో కీలక పాత్ర పోషించిన కమెడియన్ సప్తగిరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల, ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన, తన కెరీర్ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల్లో అవకాశాలు రాలేదని, కేవలం చిన్న చిత్రాలకే పరిమితం కావాల్సి వచ్చిందని అన్నారు.
*Modi-Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రధాని మోదీ.. ఫ్యామిలీతో ఫోటోలు నెట్టింట వైరల్
సప్తగిరి(Sapthagiri) చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ది రాజా సాబ్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటించి, గ్లోబల్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయాన్ని సప్తగిరి అంత త్వరగా ఎలా మర్చిపోతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక స్టార్ హీరో సినిమాను చిన్న సినిమాల జాబితాలో వేయడం సరికాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సప్తగిరి కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా లేక పొరపాటున అన్నారా అనే విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ‘ది రాజా సాబ్’ సినిమా వేడుకల్లో సప్తగిరి ఇచ్చిన స్పీచ్‌ను అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఈ చిత్రం ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు సాధిస్తుందని స్టేజ్ మీద ఉద్వేగంగా మాట్లాడిన ఆయన, ఇప్పుడు తన ఖాతాలో పెద్ద సినిమాలే లేవని చెప్పడం కరక్ట్ కాదని విమర్శిస్తున్నారు. సప్తగిరి మాటలను తప్పుబడుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ వివాదంపై సప్తగిరి స్పందించి క్లారిటీ ఇస్తే తప్ప ఈ విమర్శలు తగ్గేలా కనిపించడం లేదు.
