Prabhas : బాహుబలి తర్వాత అన్ని ఎదురు దెబ్బలే.. ప్రభాస్‌కి టైం వచ్చేది ఎప్పుడు?

బాహుబలి రెండు భాగాలతో ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. గ్లోబల్ వైడ్ గానూ మంచి అప్రిసియేషన్ దక్కించుకున్నాడు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

Prabhas getting flops from last 3 movies waiting for pan India hit

Prabhas :  బాహుబలితో వచ్చిన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో బాగా విస్తరించుకున్నాడు ప్రభాస్. బాహుబలి రెండు భాగాలతో ఇండియా మొత్తం మోస్ట్ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. గ్లోబల్ వైడ్ గానూ మంచి అప్రిసియేషన్ దక్కించుకున్నాడు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో ప్రభాస్ కి ఇండియాలో తిరుగులేని మార్కెట్ వచ్చిపడింది. ఆ క్రేజ్ తోనే ‘సాహో’ మూవీకి భారీ హైప్ క్రియేట్ అయింది. బాహుబలిని మించే కలెక్షన్స్ ఊహించారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ సౌత్ మార్కెట్ దెబ్బతింది. ఇక్కడ ఫ్లాపయినా నార్త్ లో అదరగొట్టింది సాహో. నార్త్ లో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

అయితే సాహో ఫెయిల్యూర్ ఎఫెక్ట్ నెక్స్ట్ మూవీ రాధేశ్యామ్ పై ఏ మాత్రం పడలేదు. సినిమా మేకింగ్ కు చాలా కాలం పట్టింది. కరోనా వల్ల రిలీజ్ కాస్త లేటయినప్పటికీ సినిమాకి సూపర్ క్రేజ్ వచ్చి పడింది. ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. అయితే ఈ మూవీ కూడా అందరినీ పూర్తిగా డిజప్పాయింట్ చేసింది. తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా చేసిన ఈ లవ్ స్టోరీతో ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయాడు ప్రభాస్. ఈ మూవీ బాలీవుడ్ లో కూడా సేమ్ రిజల్ట్ రాబట్టింది. రాధేశ్యామ్ ఏకంగా డిజాస్టర్ లిస్ట్ లోకి చేరింది. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కు వరుస ఫ్లాప్స్ ఎదురయ్యాయి అనుకుంటే లిస్ట్ లోకి లేటెస్ట్ గా రిలీజైన ఆదిపురుష్ మూవీ కూడా చేరిపోయింది.

ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసుకుని బాలీవుడ్ లో తీసిన ఆదిపురుష్ మూవీకి అక్కడ చాలా పూర్ రేటింగ్స్ వచ్చాయి. ఫస్ట్ 3 డేస్ లోనూ 300 కోట్లకు పైగానే రాబట్టిన ఈ మూవీ 5 రోజులు పూర్తయ్యేసరికి వసూళ్ళలో పూర్తిగా డౌన్ ఫాల్ కనిపించింది. హైయస్ట్ అంచనాలతో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఈ మూవీ కూడా ఫ్లాప్ లిస్ట్ లో కలిసిపోయింది. దానికి తోడు ఆదిపురుష్ సినిమా పూర్తిగా వివాదాల్లో మునిగింది. ప్రభాస్ కు వరుసగా మూడో ఎదురు దెబ్బగా ఆదిపురుష్ నిలిచిపోయింది. బాహుబలి రిలీజయి 6 ఏళ్ళు అవుతున్నా దాని తర్వాత ప్రభాస్ కు ఒక్క హిట్ కూడా దక్కలేదు.

Adipurush : విమర్శలు ఎన్ని వచ్చినా కలెక్షన్స్ మాత్రం అదుర్స్.. ఆదిపురుష్ @ 410 కోట్లు..

ఈ మూడు సినిమాలు ఫ్లాపయితే ఏంటి? నెక్స్ట్ రాబోతున్న సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ప్రభాస్ తిరిగి ఓ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అవుతాడని, పాన్ ఇండియా స్టార్ గా మళ్ళీ చక్రం తిప్పుతాడని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇక సలార్ మూవీ మరో మూడు నెలల్లో రిలీజ్ కాబోతుండడంతో అప్పుడే సినిమాకి కౌంట్ డౌన్ మొదలుపెట్టేశారు. కథల విషయంలో ప్రభాస్ కేర్ తీసుకోకపోతే, అతడి కెరీర్ లో మరిన్ని పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ తప్పవని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ప్రభాస్ కు పాన్ ఇండియా హిట్ సలార్ తో అయినా వచ్చి పడుతుందేమో చూడాలి.