Prabhas Heroins : స్టార్ హీరోయిన్స్‌ని దూరం పెడుతున్న ప్రభాస్..? ఒకప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హీరోయిన్లకి పెద్దగా స్టార్ ఇమేజ్ కానీ, సక్సెస్ రేట్ కానీ లేదు.

Prabhas Giving Chances to New and Upcoming Actresses in His Films

Prabhas Heroins : ప్రభాస్ అన్ డౌటెడ్ లీ ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో. బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డుల్ని బద్దలుకొట్టి సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తున్న స్టార్ హీరో. మరి ఇంత రేంజ్ ఉన్న హీరో కి హీరోయిన్ గా కూడా అదే రేంజ్ లో ఉన్నవాళ్లని సెట్ చేస్తారు. బాహుబలి వరకు కూడా ప్రభాస్ పక్కన నటించడానికి ఆ సమయంలో ఉన్న స్టార్ హీరోయిన్స్ నే తీసుకున్నారు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాలకు కూడా ఎంతో కొంత స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ నే తీసుకున్నారు ప్రభాస్ పక్కన. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది.

సాధారణంగా పాన్ ఇండియా మూవీ అంటే అటు బాలీవుడ్, ఇటు సౌత్ ని రెండిటినీ ఎట్రాక్ట్ చేసేలా స్టార్ కాస్ట్ ఉండాలి. స్పెషల్లీ ఈ మధ్య సౌత్ హీరోకి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోయిన్లని సెట్ చేస్తున్నారు. అలా చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ జాన్వితోనే సినిమాలు చేస్తున్నారు. కల్కి సినిమాలో కూడా దీపిక పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్ ని తీసుకొచ్చారు. కానీ ప్రభాస్ తన హీరోయిన్ల విషయంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. హీరోయిన్ సెలక్షన్ విషయంలో సరికొత్త రూట్లో వెళుతున్నారు. పెద్దగా స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లతోనే ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చేస్తున్నారు.

Also Read : Rana – Samantha : రానా – సమంత కలిసి నటించిన సినిమా చూసారా? ఇప్పుడు తెలుగులో రిలీజ్..

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హీరోయిన్లకి పెద్దగా స్టార్ ఇమేజ్ కానీ, సక్సెస్ రేట్ కానీ లేదు. లేటెస్ట్ గా ప్రభాస్ హనురాఘవపూడి డైరెక్షన్లో చేస్తున్న సినిమాకి ఇమాన్వి ఇస్మాయెల్ అనే డ్యాన్సర్ ని హీరోయిన్ గా సెట్ చేశారు. సోషల్ మీడియాలో డ్యాన్సర్ గా ఫాలోవర్స్ ఉన్నా ఇప్పటి వరకూ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఏమాత్రం పరిచయం లేదు ఇమాన్వి. 1940లో జరిగిన వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ – ఇమాన్వి జోడీ ఎలా ఉండబోతోందా అని ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

హనురాఘవపూడి సినిమాలోనే కాదు మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ లో కూడా ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లే ప్రభాస్ కి జంటగా నటిస్తున్నారు. హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ లో హీరోయిన్లుగా రిద్దికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్.. ఈ ముగ్గురు నటిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లలో తెలుగులో పెద్దగా సినిమాలు చేసిన వాళ్లు కానీ అసలు స్టార్ క్రేజ్ ఉన్న వాళ్లు కానీ లేరు. అయినా సరే ఈ హీరోయిన్లకి చాన్సిచ్చారు. ప్రభాస్ సినిమాల్లో ఎలాగూ హీరోయిన్లకి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుందనో, లేక స్టార్ హీరోయిన్ అయితే ఓవర్ హైప్ ఉంటుందనో, ఫ్రెష్ ఫేసెస్ కావాలనో పెద్దగా స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. దీంతో కెరీర్ మొదట్లోనే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నామనే ఆనందం ఆ హీరోయిన్స్ కి ఉంటుంది. ఆ హీరోయిన్స్ కెరీర్ కి ప్లస్ అవుతుంది. రాబోయే సినిమాల్లో కూడా ప్రభాస్ ఇదే కంటిన్యూ చేస్తూ కొత్త హీరోయిన్స్ కి, చిన్న హీరోయిన్స్ కి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు