Prabhas In Hospital: ఆసుపత్రిలో ప్రభాస్.. టెన్షన్‌లో ఫ్యాన్స్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్-K అనే సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ప్రభాస్ ఆసుపత్రిలో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
- Anil Aaleti
- Published on- September 10, 2022 / 08:35 PM IST
Prabhas In Hospital Video Goes Viral
Prabhas In Hospital: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన ఆదిపురుష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేయగా, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్ట్-K అనే సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో కూడా ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ప్రభాస్ ఆసుపత్రిలో కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.
Prabhas: ప్రభాస్ బర్త్ డేకి రీ రిలీజ్ “బిల్లా” కాదట.. మరే సినిమా?
ప్రభాస్ ఆసుపత్రిలో ఏం చేస్తున్నాడు.. ఆయన అసలు ఆసుపత్రికి ఎందుకు వెళ్లారు.. ఆయనకు ఏమైంది.. ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల ప్రభాస్‌కు ఓ సర్జరీ జరిగిందనే వార్త కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. సీతా రామం చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉన్నా, ఆయన హాజరు కాలేదు. ఆ సమయంలోనే ప్రభాస్ సర్జరీకి సంబంధించిన వార్తలు జోరుగా వినిపించాయి. ఇక తాజాగా ప్రభాస్ ఓ ఆసుపత్రిలో ఐసీయూ నుండి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయనకు ఏమైందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Prabhas: ఆదిపురుష్ నుంచి అప్డేట్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన ఓమ్ రౌత్!
అయితే ఆ వీడియో ఇప్పటిదా లేక పాతదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందని అభిమానులు అంటున్నారు. అంతేగాక, ఇటీవల కృష్ణం రాజు ఆసుపత్రిలో అడ్మిట్ కాగా, ప్రభాస్ ఆయన్ను చూడటానికి వెళ్లి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు. అయితే ప్రభాస్ జుట్టు, ముఖం ఏదీ కూడా కనిపించకుండా మాస్క్ వేసుకోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వీడియోలో ఉన్నట్లుగా నిజంగా ప్రభాస్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడా అనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చే వరకు అభిమానులు ఆందోళన చెందొద్దని పలువురు అంటున్నారు.
#Prabhas Anna spotted at hospital.His swag ?? pic.twitter.com/bk4i2rqduK
— SALAAR – the monster (@NawinMoto) September 10, 2022
