Prabhas: ప్రభాస్ బర్త్ డేకి రీ రిలీజ్ “బిల్లా” కాదట.. మరే సినిమా?

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. వరుసపెట్టి బడా హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ వారి పుట్టినరోజున వేడుకుల నాడు మళ్ళీ విడుదలై సందడి చేస్తున్నాయి. ఈ ట్రెండ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకారం చుట్టగా, అదే దారిలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యణ్ పయనించారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే దారిలో వెళ్లబోతున్నాడు.

Prabhas: ప్రభాస్ బర్త్ డేకి రీ రిలీజ్ “బిల్లా” కాదట.. మరే సినిమా?

Varsham Movie Re Releases on Prabhas Birthday

Prabhas: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. వరుసపెట్టి బడా హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ వారి పుట్టినరోజున వేడుకుల నాడు మళ్ళీ విడుదలై సందడి చేస్తున్నాయి. ఈ ట్రెండ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకారం చుట్టగా, అదే దారిలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యణ్ పయనించారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే దారిలో వెళ్లబోతున్నాడు.

Prabhas: ఆదిపురుష్ నుంచి అప్డేట్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన ఓమ్ రౌత్!

మూవీ మేకర్స్ స్టార్ హీరోల పాత హిట్ సినిమాల్ని కొత్తగా 4Kలోకి మేకోవర్ చేసి మునుపటికంటే బెటర్ క్వాలిటీతో అభిమానులకు తమ అభిమాన హీరోని తెరపై చూపిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ పుట్టినరోజున.. మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన “పోకిరి”ని ప్రదర్శించగా, మెగాస్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఘరానా మొగుడు”, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీస్ జల్సా, తమ్ముడు సినిమాల్ని, తమిళ్ హీరో ధనుష్ “3” సినిమాలను ఇప్పటివరకు రీ రిలీజ్ చేశారు.

ఇదే వరుసలో అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అతడి స్టైలిష్ హిట్ మూవీ “బిల్లా”ను కూడా రీ రిలీజ్ చేస్తునట్టు వార్తలు వచ్చాయి. అయితే విడుదలకు సిద్దమవుతుంది బిల్లా కాదు ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అయిన “వర్షం” సినిమా అని తెలుస్తుంది. MS రాజు నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలై ప్రభాస్ కెరీర్ కి బూస్ట్ ని ఇచ్చింది. అయితే రీ రిలీజ్ పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తాము మిస్ అవుతున్న వింటేజ్ ప్రభాస్ ని మరోసారి థియేటర్లో చూడడానికి ఎదురు చూస్తున్నారు, మరి ఏ మూవీని మేకర్స్ ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారో చూడాలి.