Prabhas
Prabhas : ప్రభాస్ కి ఫుడ్ కి ఉన్న స్పెషల్ ఎమోషన్ అందరికి తెలిసిందే. తాజాగా ప్రభాస్ పునుగులు గురించి మాట్లాడిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ప్రభాస్ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ లో నిర్మించిన కపుల్ ఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ యూనిట్ తో ప్రభాస్ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.(Prabhas)
ఈ ఇంటర్వ్యూలో హీరోయిన్ ప్రభాస్ ని మీరు విజయవాడ పునుగులు ఎప్పుడైనా తిన్నారా అని అడిగింది.
Also Read : Mahesh Babu : బెంగళూరులో AMB సినిమాస్ ఓపెనింగ్.. సందడి చేసిన మహేష్.. ఫోటోలు వైరల్..
దీనికి ప్రభాస్ సమాధానమిస్తూ.. నాకు విజయవాడ పునుగులు చాలా ఇష్టం. విజయవాడలో ప్రమోద్(ప్రభాస్ కజిన్, నిర్మాత) వాళ్ళింటి దగ్గర ఒక పునుగులు బండి ఉండేది. చిన్నప్పుడు హాలిడేస్ కి అక్కడికి వెళ్ళేవాడిని. ప్రమోద్ వాళ్ళ నాన్న నన్ను, ప్రమోద్ ని స్కూటర్ మీద కూర్చోపెట్టి తీసుకెళ్లి పునుగులు ఇప్పించేవాళ్ళు. నాకు ఇప్పటికి గుర్తుంది. విజయవాడ వెళ్ళినప్పుడల్లా పునుగులు తినాలనిపిస్తుంది. అలాంటి పునుగులు నేను ఎక్కడా తినలేదు. చాలా బాగుంటాయి. ప్రతి ఊరికి ఒక స్పెషల్ ఫుడ్ ఉంటుంది. విజయవాడకు పునుగులు. నేను నైట్ ఎక్కువ ట్రావెల్ చేస్తా. విజయవాడ వైపు వెళ్ళినప్పుడు దారిలో పునుగులు కనిపిస్తే కార్ ఆపి తిందాం అనుకుంటా కానీ నైట్ టైం ఉండవు అని అన్నారు.
దీంతో ప్రభాస్ కామెంట్స్ వైరల్ గా మారాయి. విజయవాడ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ పునుగులు కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read : Shivani Nagaram : వామ్మో.. తిరుమలలో 15 నిముషాలు స్వామి వారిని దర్శనం చేసుకున్న హీరోయిన్.. కామెంట్స్ వైరల్..
#Punugulu is an emotion for every Andhra person ❤️#Prabhas #CoupleFriendlypic.twitter.com/Y3rkzr87rR
— Milagro Movies (@MilagroMovies) February 20, 2026