బాలీవుడ్ భామలనే ఫాలో అవుతున్న ప్రభాస్.. టాలీవుడ్ హీరోయిన్లను పక్కకుపెట్టేశాడా..

ఇండియా సినీ పరిశ్రమలోనే రెబల్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్.. సోషల్ మీడియాలో కాస్త లేట్ గానే ఎంటర్ అయ్యాడు. ఫేస్ బుక్ అకౌంట్‌ను వేరే ఏజెన్సీ నడుపుతుండగా ట్విట్టర్ లో ఇంకా ఖాతా తెరవలేదు. సాహో సినిమాకు ముందే ఇన్‌స్టాలోకి ఎంటరైన ప్రభాస్ అకౌంట్ కు దాదాపు 5మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
ఫాలోవర్లు అంతమంది ఉంటే ప్రభాస్ ఫాలో అయ్యేది ఎంతమందినో తెలుసా.. కేవలం ఐదుగురినే. వారిలో కూడా ఉంది ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లే. మిగిలిన ఇద్దరు సాహో సినిమా డైరక్టర్, మరొకరు భాగ్య శ్రీ అని న్యూట్రీషనిస్ట్. మరే టాలీవుడ్ సెలబ్రిటీని ఫాలో అవడం లేదు.
సాహో సినిమా హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాధేశ్యామ్ సినిమా హీరోయిన్ పూజా హెగ్దే, కొత్తగా రెడీ అవనున్న ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరోయిన్ దీపికా పదుకొణెను మాత్రమే ఫాలో అవుతున్నారు. రెబల్ స్టారే ఫాలో అవుతున్నాడంటే మరి వీళ్ల క్రేజ్ మామూలు కాదనేగా అర్థం. ఇంకోవైపు టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒక్కరిని కూడా ఫాలో అవకపోవడంపై పలు పుకార్లు వినిపిస్తున్నాయి.