Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ టీం వార్నింగ్ నోట్.. ఇక నుంచి అలా చేస్తే..
ఇక నుంచి అలా చేస్తే ప్రభాస్ 'కల్కి' టీం లీగల్ యాక్షన్ తీసుకోనుంది.
- gum 95921
- Published on- September 21, 2023 / 03:27 PM IST
Prabhas Kalki 2898 AD makers release warning note to leakers
Kalki 2898 AD : ప్రభాస్ (Prabhas) లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు మేకర్స్.. ఆ మూవీ నుంచి ఏమీ లీక్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని తీసుకున్నా.. ఏదొక విధంగా ఏదోకటి బయటకి వస్తూనే ఉంటున్నాయి. ఇక ఇటీవల ‘కల్కి 2898 AD’ మూవీ నుంచి ఒక పిక్ లీక్ అయ్యింది. ఈ మూవీ కోసం VFX వర్క్స్ చేస్తున్న కంపెనీ నుంచే ఆ పిక్ లీక్ అయ్యిందని మూవీ టీం అప్పుడు చాలా సీరియస్ అయ్యింది. వారిపై లీగల్ గా యాక్షన్ కూడా తీసుకున్నారు.
National Cinema Day : మల్టీప్లెక్స్‌లలో రూ.99కే సినిమా.. కానీ ఆంధ్రా, తెలంగాణలో..
ఇక ఆ లీక్ అయిన పిక్ ని సోషల్ మీడియాలో అనేకమంది షేర్లు చేస్తూ వైరల్ చేశారు. ఇక అలాంటి వారికి కూడా కల్కి మూవీ టీం ఒక వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది. మూవీకి సంబంధించిన పిక్స్, వీడియోస్, ఫ్యూటేజ్ వంటివి ఏమీ షేర్ చేసినా వారి పై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామంటూ చిత్ర యూనిట్ ఒక నోటీసు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sharwa35 : కృతిశెట్టికి బర్త్ డే విషెస్.. శర్వానంద్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..
కాగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో సి అశ్వినీ దత్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. కమల్ హాసన్ (Kamal Haasan) విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే (Deepika Padukone), అమితాబ్ (Amitabh Bachchan), దిశా పటాని (Disha Patani) వంటి బడా స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకు వస్తామంటూ మేకర్స్ ప్రకటించినప్పటికీ.. అప్పుడు రావడం కష్టం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
