National Cinema Day : మల్టీప్లెక్స్‌లలో రూ.99కే సినిమా.. కానీ ఆంధ్రా, తెలంగాణలో..

ఈ ఏడాది కూడా నేషనల్ సినిమా డే నాడు మల్టీప్లెక్స్‌లలో సినిమాని తక్కువ ధరకే చూడవచ్చు.

National Cinema Day : మల్టీప్లెక్స్‌లలో రూ.99కే సినిమా.. కానీ ఆంధ్రా, తెలంగాణలో..

multiplex 99 ticket offer on National Cinema Day

Updated On : September 21, 2023 / 3:02 PM IST

National Cinema Day : మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MIA).. గత ఏడాది ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. నేషనల్ సినిమా డే (National Cinema Day) నాడు మల్టీప్లెక్స్‌లలో రూ.75కే సినిమా చూడవచ్చు అని ప్రకటించి సినీ లవర్స్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. గత ఏడాది ఈ ఆఫర్ ని ఉపయోగించుకొని అత్యధిక ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌లలో సినిమాలు చూసి రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది కొన్ని రిపోర్టులు ప్రకారం సుమారుగా 6.5 మిలియన్ మంది మల్టీప్లెక్స్‌లలో సినిమాను చూశారని సమాచారం.

Akhil Mishra : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బాలీవుడ్ నటుడు మృతి..

ఇది ఒక రికార్డుగా సినీ విశ్లేషకులు అప్పటిలో తెలియజేశారు. ఇక ఈ ఏడాది కూడా నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. టికెట్ రేటుని కొంచెం పెంచి అలాంటి ఒక ఆఫర్ ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. అక్టోబర్ 13న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా.. మల్టీప్లెక్స్‌లలో కేవలం రూ.99కే సినిమాని ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మాత్రం వర్తించదు. గత ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ని ఇవ్వలేదు మల్టీప్లెక్స్ అసోసియేషన్.

Sharwa35 : కృతిశెట్టికి బర్త్ డే విషెస్.. శర్వానంద్ సినిమా నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆఫర్ అసలు లేదు. కానీ తెలంగాణలో మాత్రం ఆ రోజున మల్టీప్లెక్స్ టికెట్ రూ.112 ఉంటుంది. ఇక ఈ ఏడాది కూడా ప్రేక్షకులు థియేటర్స్ కి భారీ స్థాయిలో వస్తారని అంచనా వేస్తున్నారు. కాగా ఆ సమయానికి పలు క్రేజీ సినిమాలు కూడా థియేటర్ లో ఉండనున్నాయి. దీంతో అభిమానులు థియేటర్ కి ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ ఏడాది ఎలాంటి రికార్డుని సృష్టిస్తారో చూడాలి. అయితే ఏపీ ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో నిరాశ చెందుతున్నారు.