Prabhas Maruthi Movie get back to shoot prabhas will join maruthi movie shoot from next week
Prabhas : ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆదిపురుష్(Adipurush) తో వచ్చి అభిమానుల్ని, ప్రేక్షకులని నిరాశ పరిచాడు ప్రభాస్. త్వరలో రానున్న సలార్(salaar) సినిమాపై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సలార్ సినిమా షూటింగ్ అయిపొయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది సలార్. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక కల్కి(Kalki) సినిమా షూట్ కూడా చివరి దశలో ఉన్నట్టు సమాచారం.
ఈ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ మీడియం బడ్జెట్ సినిమాని ప్రభాస్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉండటంతో మారుతి సినిమా షూటింగ్ ఆగింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ పూర్తవ్వడం, కల్కి చివరి దశలో ఉండటంతో మారుతికి డేట్స్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపిస్తుంది .
Susmita Sen : లలిత్ మోదీకి బ్రేకప్ చెప్పిన సుస్మిత సేన్..? రిలేషన్ మూన్నాళ్ళ ముచ్చటేనా?
వచ్చే వారం నుంచే ప్రభాస్ మారుతి సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ప్రస్తుతం సెట్ వర్క్స్ జరుగుతున్నట్టు, సెట్ వర్క్ పూర్తవ్వగానే ప్రభాస్ – మారుతి సినిమా మొదలు పెడతారని టాలీవుడ్ టాక్. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.