Prabhas Maruthi Movie Makers Tweet Createz Buzz
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ చిత్రాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Prabhas : ఇలాంటి సినిమాలు చాలా చేయాలి మనం.. ‘దసరా’పై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..
అయితే, మారుతి దర్శకత్వంలో మూవీని ప్రభాస్ చాలా త్వరగా పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు సదరు చిత్ర యూనిట్ కూడా రెడీ అయ్యిందట. ఇక ఈ సినిమా ఔట్‌పుట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. తాజాగా ఓ అభిమానికి ఈ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas: మే నెలలో భయపట్టేందుకు రెడీ అవుతున్న ప్రభాస్.. నిజమేనా?
ప్రభాస్, మారుతి సినిమాను గట్టిగా ఇవ్వాలమ్మా.. అంటూ ఓ అభిమాని మేకర్స్‌కు ట్వీట్ పెట్టగా.. ఖచ్చితంగా అలాంటి సినిమానే వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ప్రభాస్, మారుతిల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై నెట్టింట చర్చ సాగుతోంది. మరి ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.