Prabhas : ఒరే నాయనా.. అది ప్రభాస్ కాదురా.. ఆ ఫోటో నాదే.. నటుడు కామెంట్స్..

పలువురు నెటిజన్లు ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఈ ఫోటోని వైరల్ చేసారు. (Prabhas)

  • Published On : March 12, 2026 / 09:10 AM IST

Prabhas

Prabhas : ఇటీవల ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫొటోలో ఫేస్ కనిపించకుండా వెనక నుంచి తీశారు. వెనక నుంచి చూస్తే అది ప్రభాస్ ఫోటోనే అని అనిపిస్తుంది. హైట్ లో తేడా ఉన్నా బ్యాక్ లుక్స్ ప్రభాస్ లాగానే ఉన్నాయి. దీంతో పలువురు నెటిజన్లు ప్రభాస్ స్పిరిట్ లుక్ అంటూ ఈ ఫోటోని వైరల్ చేసారు.

అయితే ఈ ఫోటో ప్రభాస్ ది కాదు నాదే అంటూ ఓ నటుడు చెప్పుకొచ్చాడు. వరుడు కావలెను, పుష్ప, RRR, ఆంద్ర కింగ్ తాలూకా.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడిప్పుడే వరుస సినిమాలు చేస్తున్నాడు శివ గణేష్. ఇటీవల తను చేస్తున్న ఓ సినిమాలో నుంచి షూటింగ్ సమయంలో వెనక నుంచి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ప్రభాస్ ఫోటో అని వైరల్ అయింది.

Also Read : Hansika Motwanni : భర్త సోహైల్ తో విడాకులు.. అతని గురించి ఈ విషయం తెలుసా.. అంతకుముందే హన్సిక ఫ్రెండ్ తో..

దీనిపై శివ గణేష్ స్పందిస్తూ.. అది ఇటీవల నేను ఒక సినిమా షూటింగ్ లో దిగిన ఫోటో. ఎందుకు అది ప్రభాస్ ఫోటో అని వైరల్ అయిందో నాకు తెలీదు. వెనక నుంచి చూస్తే కొంచెం లుక్స్ అలాగే ఉన్నాయని అంటున్నారు. ఫ్రెండ్స్ కూడా ఇది ప్రభాస్ ఫోటో అని వేసిన ట్వీట్స్ నాకు పంపించారు. కానీ ఆ ఫోటో మాత్రం నాదే, ప్రభాస్ ది కాదు అని తెలిపాడు.